శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 09, 2020 , 01:00:20

సీఎం కేసీఆర్‌ వెన్నంటే రైతులు

సీఎం కేసీఆర్‌ వెన్నంటే రైతులు
  • సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం
  • డీసీఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డికి అభినందనలు
  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • నర్సింగాపూర్‌ సహకారం సంఘం పాలకవర్గం ఏకగ్రీవం కావడంపై హర్షం

బోయినపల్లి: వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న సీఎం కేసీఆర్‌ వెన్నంటే రైతులు నిలుస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వివరించారు. సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించా రు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌ సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవమైంది. అందు లో డైరెక్టర్‌గా ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి సైతం ఎన్నికయ్యారు. కరీంనగర్‌లోఎమ్మెల్యే రవిశంకర్‌ను సురేందర్‌రెడ్డి, సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సురేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, స్వీ ట్‌ తినిపించి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌  కృషి చేస్తున్నారని కొనియాడారు. 


అందుకే నర్సింగాపూర్‌ సహకార సంఘం డైరెక్టర్ల ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని వివరించారు. ప్రభుత్వం రైతులకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో లక్షల కోట్లతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నదనీ, దేశంలో ఎక్క డాలేని విధంగా రైతు బంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. గతంలో నిర్వీర్యమైన సహకార సంఘాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంఅభివృద్ధి దిశలోకి తీసుకొచ్చిందని తెలిపారు. రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్‌ సాగర్‌రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కత్తెరపాక కొండ య్య తదితరులు పాల్గొన్నారు. 


logo