బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Feb 09, 2020 , 00:57:38

మనసున్న మారాజు కేటీఆర్‌

మనసున్న మారాజు కేటీఆర్‌
  • దివ్యాంగులకు నేనున్నానే భరోసా
  • శ్రీనివాస్‌ కుటుంబానికి అండ
  • డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, పార్టీ తరపున రూ.లక్ష మంజూరు
  • జీవితకాలం రుణపడి ఉంటాం
  • వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
  • జిల్లా కేంద్రంలో సంతాప సభకు హాజరుసిరిసిల్లటౌన్‌: మనసున్న మారాజు మంత్రి కేటీఆర్‌ అనీ, దివ్యాంగులంటే ప్రత్యేక ఆదరణ చూపుతున్నారని వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కొనియాడారు. సాహితీ దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు తడుక శ్రీనివాస్‌ సంతాప సభను జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సభకు టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. అనంతరం వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మ న్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ మృతి దివ్యాంగులకు తీరని లోటుని అభివర్ణించారు. దివ్యాంగుల హక్కు ల సాధన కోసం ఆయన అహర్నిశలు కృషి చేశాడని కొనియాడారు. 


దివ్యాంగుల సమస్యలు, వారి హక్కులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలకంగా పనిచేశారని గుర్తచేశారు. మంత్రి కేటీఆర్‌ సహకారంతో అనేకమంది దివ్యాంగుల సమస్యలను సైతం పరిష్కరించాడని తెలిపారు. దివ్యాంగులపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకమైన సా నుభూతి కలిగి ఉన్నారని, ప్రైవేటు కంపెనీల ద్వారా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. సమస్య ఏదైనా తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని వివరించారు. శ్రీనివాస్‌ కుటుంబానికి నేనున్నానని మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారని కొనియాడారు. ప్రభుత్వం తరపున డబుల్‌బెడ్‌ రూం ఇంటిని, టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించడం అభినందనీయమన్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేశాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.500లు ఉన్న పింఛన్‌ను ప్రస్తుతం రూ.3016లు అందిస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని వివరించారు. అచేతన స్థితిలో ఉండే దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు పింఛన్‌ ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. మూడు చక్రాల వాహనాలు అందించడంతో పాటు సబ్సిడీ రుణాలను రూ.10కోట్లు అందించారన్నారు. వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ.లక్ష ప్రభు త్వం తరుపున నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తున్నారన్నా రు. ఉద్యోగాల రిజర్వేషన్లను 4శాతానికి పెంచారని, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారని గుర్తచేశారు. 


దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు ప్రోత్సాహకాలు అందుతున్నాయని కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మంజూరు చేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇంటి పత్రాలను శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు జి ల్లా సంక్షేమశాఖ ప్రత్యేక అధికారి రాహుల్‌శర్మ అందజేశా రు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి రూ.లక్షను వాసుదేవరెడ్డితో కలిసి అందజేశారు. త డుక శ్రీనివాస్‌ చేసిన సేవా కార్యక్రమాలతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను వారు సందర్శించారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ గుగులోత్‌రేణ, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల కృష్ణ, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతరవేణి చందర్‌రావు పాల్గొన్నారు. 


logo