శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Feb 09, 2020 , 00:56:55

అకాల వర్షం

అకాల వర్షం

సిరిసిల్ల రూరల్‌/కోనరావుపేట/ఇల్లంతకుంట: జిల్లాలో శనివారం అకాల వర్షం కురిసింది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో తేలికపాటి వాన పడింది. మధ్యా హ్నం పదిహేను నిమిషాల పాటు గాలివానతో కు రిసిన వర్షానికి తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌ సమ్మక్కసారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారు వేసుకున్న గుడారాలు, టెంట్లు కుప్పకూలిపోయాయి. కొన్ని గుడారాలపైన రేకులు కొట్టుకు పోయాయి. ఓబులాపూర్‌లో అరగంట పాటు కురిసిన వర్షం అందరిని ఆ గం చేసింది. భక్తులంతా సమీప మామిడితోటలకు వెల్లి తలదాచుకున్నారు. అదేవిధంగా ఇల్లంతకుంట మండల కేంద్రం తోపాటు పలు గ్రామాలలో స్వల్ప వర్షం కురిసింది. కోనరావుపేట మం డల వ్యాప్తంగా స్వల్పంగా వర్షం కురిసింది. ఉద యం వేళ నుంచే చల్లటి వాతావరణం నెలకొని ఉండడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. 


logo