శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 07, 2020 , 02:37:46

రెప్పపాటూ కరెంటు పోదు

రెప్పపాటూ కరెంటు పోదు

కోనరావుపేట: గత ప్రభుత్వాల పాలనలో కరెంటు లేక ప్రజలు అవస్థలు పడ్డ్డారాని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెప్పపాటూ క రెంటు పోకుండా చేశారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కొనియాడారు. కోనరావుపేట మండల కేంద్రంలో  ఎకరం స్థలంలో రూ.1కోటి 30లక్షలతో  చేపట్టనున్న 33/11కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం పనులకు జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుం దని ఎద్దేవా చేశారని, కానీ సీఎం కేసీఆర్‌ ఏడాది కాలం లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా నిరంతర కరెంటు అందించారని గుర్తుచేశారు. దీంతో రైతులకు కరెంటుతో ఇబ్బందులు తొలగి ఆత్మహత్యలు తగ్గాయన్నారు. అంతే కాక ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. 43వేల సబ్‌స్టేషన్ల నుంచి 74వేల సబ్‌స్టేషన్లను నిర్మించిందని, ప్రధానంగా  వ్యవసాయానికి నా ణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నిమ్మపల్లి 133/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నదని తెలిపారు. మ రో రెండు నెలల్లో మిగిలిన సబ్‌స్టేషన్ల పనులు కూడా ప్రా రంభమవుతాయన్నారు. తద్వారా లోవోల్టేజీతో పాటు కరెంటు సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. రైతులకు కరెంటుతో పాటు సాగు నీటిని కూడా ప్రభుత్వం అందించబోతున్నదని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం సస్యశామలం కాబోతున్నదని తెలిపారు. మల్కపేట రిజర్వాయ ర్‌ ద్వారా ఇటు సాగునీరు, అటు కరెంటుతో రైతులకు ఢో కా లేకుండా ఉంటుందని ఉద్ఘాటించారు. 


ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే విజయం..

ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని ఎ మ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సహకార సంస్థ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలూ చేయని పనులను టీఆర్‌ఎస్‌ చేస్తున్నదని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌ తదితర కార్యక్రమాలను ఉదహరించారు. సహకార సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో సహకార సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీ చంద్రయ్య, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సంతోష్‌, వైస్‌ఎంపీపీ సుమలత, సెస్‌ ఏడీ రఘపతి, సర్పంచ్‌ రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, ఉపసర్పంచ్‌ శ్రీను, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సయ్య, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దాలి

అనంతరం మంగళ్లపల్లి, వట్టిమల్ల గొల్లపల్లి, అజ్మీరా తండా, వట్టిమల్ల గ్రామ పంచాయతీలు నూతన ట్రాక్టర్లను కొనుగోలు చేయగా ఆయా గ్రామాల సర్పంచ్‌లకు వాటిని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణతో కలిసి ఎమ్మెల్యే రమేశ్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామాలుగా స్వచ్ఛంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. పల్లెలు ప్రగతి బాట పట్టేందుకు సీఎం కేసీఆర్‌ కృష్టి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే  30రోజుల కా ర్యాచరణ ప్రణాళిక, పల్లెప్రగతి కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది, సీ ఎం కేసీఆర్‌ కలలను సాకరం చేయాలన్నారు. ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



logo