గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 07, 2020 , 02:35:17

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి

ముస్తాబాద్‌: గ్రామస్తుల సమష్టి కృషి, అధికారుల సహకారంతోనే పల్లెలు అభివృద్ధి పథంలో పయనించి ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ పూర్వీకుల గ్రామమైన మండలంలోని మోహినికుంట గ్రా మాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు  మోహినికుంట గ్రా మస్తులతో జిల్లాలోని అన్నిశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సును గురువారం నిర్వహించగా, కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పని చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే ముందున్న లక్ష్యం పూర్తవుతుందన్నా రు. 


వ్యవసాయానుబంధ రంగాల సహకారంతో కూరగాయల సాగు, పాలీహౌస్‌, పాడిపరిశ్ర మా భివృద్ధికి  గెదెల పంపిణీ, సాగులో నూతన విధానాలు, కోళ్ల , గొర్రెలు, బర్రెల పెంపకం, కుట్టుమిషన్‌, అల్లికలపై శిక్షణ, కుటిర పరిశ్రమ, సాగులో ఆధునిక పద్ధతులపై ఆయా శాఖల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పంచాయతీ పాలక వర్గం, ప్రజలతో చర్చిస్తూ వారి నుంచి సలహాలు తీసుకోవాలన్నారు. గ్రామ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు నిరంతరం ప్రజలకు  తెలియజేస్తూ సహకారం అందిస్తారన్నారు. గంగదేవిపల్లె, అంకాపూర్‌కు దీటుగా మోహినికుంట ఆదర్శంగా మారాల ని ఆకాంక్షించారు. ఈ సదస్సు మొదటిదని ము న్ముందు మరిన్ని నిర్వహిస్తూ అభివృద్ధిపూ దిశాని ర్దేశం చేస్తామన్నారు. వివిధ శాఖల అధికారులు ప్రజోపయోగమైన పథకాలను వివరించారు. 


మద్దికుంటలో మొక్కల పరిశీలన 

తొలుత మద్దికుంటలో దారికిరువైపులా నాటి న మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. పలు సల హాలు సూచనలిచ్చారు. సమావేశంలో సర్పంచ్‌ కల్వకుంట్ల వనజ, జిల్లా ప్రత్యేక అధికారి రాహు ల్‌శర్మ, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లేశ్‌యాదవ్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి  సంస్థ అధికారి శ్రీరెడ్డి, డీపీవో రవీందర్‌,  జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల అధికారి ఉపేందర్‌, జిల్లా భూగర్భజల శాఖ అధికారి నర్సింలు, బీసీ సంక్షే మ శాఖ అధికారి సువర్ణ, అటవీ శాఖ అధికారి ఆ శ, రాజేశ్వరి, ఉమ్మడి జిల్లా ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ అధికారి రవీందర్‌, వ్యవసాయశాఖ అధికారి రణదీర్‌కుమార్‌రెడ్డి, పీడీ కౌటీల్యరెడ్డి ఏపీడీ కృష్ణ, ఉప సర్పంచ్‌ సంధ్య, యాదగిరిగౌ డ్‌, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.