గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Feb 06, 2020 , 02:48:42

ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చూడాలి

ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చూడాలి

సిరిసిల్ల రూరల్‌:  నియోజకవర్గంలో మంత్రికేటీఆర్‌ ఆదేశానుసారం  డైరెక్టర్ల స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సమన్వయంతో పనిచేయాలని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో సిరిసిల్ల ఉమ్మడి మండలం స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సహకార ఎన్నికల సన్నాహాక సమావేశం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న అధ్యక్షతన  జరిగింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, సెస్‌ మాజీచైర్మన్‌ చిక్కాల రామారావు, సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ తోట ఆగయ్య కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సింగిల్‌ విండోల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థు లు విజయం సాధిస్తారన్నారు. సీఎం కేసీఆర్‌తోనే సహకారం సంఘాలు అభివృధ్ది,ఆదర్శంగా మారాయన్నారు.  


కాళేశ్వరం ప్రాజెక్టుతో రానున్న  రోజుల్లో సిరిసిల్ల మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. సహకార ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి రైతును కలిసి, ఓట్లను అభ్యర్థించాలన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలనీ,   అంతకుముందు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావు మాట్లాడుతూ మంత్రికేటీఆర్‌ ఆదేశాలనుసారం సమన్వయంతో పనిచేయాలన్నారు. సహకార ఎన్నికల్లో డైరెక్టర్‌ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు సహకరించుకోవాలన్నారు. అన్ని స్థానాలు గెలిపించుకొని, మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. తోట ఆగయ్య మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో గులాబీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషిచేయాలన్నారు. సెస్‌ చైర్మన్‌ దొర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ ధ్యేయంగా సీఎం  కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను  గెలిపించుకోవాలని ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ లింగంరాణి కోరారు. 


కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్య, పుర్మాణి రాంలింగారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ ఉమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, పబ్బతి విజయేందర్‌ రెడ్డి, సర్పం చుల ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, మాజీ ఎంపీపీలు బండి దేవదాస్‌, పూసపల్లి సరస్వతి, మాజీమండల అధ్యక్షుడు అంకారపు రవీందర్‌, గుగ్గిల్ల అంజయ్య, తాండ్ర రవీందర్‌రావు, సింగిరెడ్డి రవీందర్‌ రెడ్డి, మీరాల భాస్కర్‌ యాదవ్‌, అబ్బాడి అనిల్‌ రెడ్డి, జక్కుల నాగరాజు, జంగపల్లి శ్రీనివాస్‌, అనవేని బాల య్య, శ్రీనివాస్‌ గౌడ్‌, శ్యాం, వైద్యశివప్రసాద్‌, తాడూరు సురేశ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.