బుధవారం 03 జూన్ 2020
Rajanna-siricilla - Feb 05, 2020 , 02:36:42

రైతు ప్రభుత్వానికి కానుక ఇవ్వాలి

రైతు ప్రభుత్వానికి కానుక ఇవ్వాలి

ముస్తాబాద్‌: రైతుల కోసం పనిచేసే ప్రభుత్వానికి పార్టీలకతీతంగా మద్దతుగా నిలిచి, సమష్టి నిర్ణయాలతో సహకార సంఘాల పాలక వర్గాలను ఏకగ్రీవం చేసి మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలను టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. ముస్తాబాద్‌ సహకార సంఘం పరిధిలోని ముస్తాబాద్‌, మొర్రాయిపల్లె, చీకోడు, చిప్పలపల్లి, నామాపూర్‌, గోపాల్‌పల్లె గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు, మండల ప్రజాప్రతినిధులతో మండలంలోని మొహినికుంటలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ముస్తాబాద్‌ సహకార సంఘాన్ని చైర్మన్‌గా పని చేసిన చక్రధర్‌రెడ్డి, డైరెక్టర్లు సమష్టి నిర్ణయాలతో ఏడేళ్లల్లోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. వారి సేవలను గుర్తించి మంత్రి కేటీఆర్‌ ముస్తాబాద్‌, పో తుగల్‌ చైర్మన్లకు మరో ఆవకాశం కల్పించి చైర్మన్‌ రేసు పె ట్టారన్నారు. మండలంలో అత్యధిక శాతం టీఆర్‌ఎస్‌ కా ర్యకర్తలు ఉన్నందున మనపై మనం పోటీ పడకుండా ఏకభాప్రాయానికి రావాలని, అవసరమైతే అన్ని పార్టీల నేతలతో మాట్లాడి ఏకగ్రీవానికి కృషి చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనీ విధంగా తెలంగాణ రైతులకు అనేక పథకాలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసమున్నందునే మొన్న జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలు పార్టీకి బ్రమ్మరథం పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 


సహకార సమరంలో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్నారు. అన్ని సొసైటీల్లో విజయం సాధిస్తామన్నారు. అభివృద్ధి చేసిన వారిని రైతులు మరిచిపోరని, రాబోయే కాలంలో సం ఘాలు మరింత వృద్ధిలోకి వస్తాయని వివరించారు. మ నందరం వ్యక్తిగత బేధాభిప్రాయాలు వీడి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి పనిచేసి, పోటీలేని విధంగా 13మంది డైరెక్టర్లను గెలిపించుకొని ఆయనకు  కానుకగా ఇవ్వాలని, అందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని కోరారు. చక్రధర్‌ గెలుపు మండల పార్టీది, పా ర్టీ బలపరిచిన వ్యక్తలకు ఓటు వేస్తే కేటీఆర్‌కు వేసినట్లేనని తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ గోపాల్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ ఏనుగు విజయరామారావు, ఏఎంసీ చైర్మన్‌ యాది మల్లేశ్‌యాదవ్‌, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నేవూరి పోచిరెడ్డి, స ర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రావు, కనవేని చక్రధర్‌రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు, పార్టీ మహిళ అధ్యక్షురాలు దబ్బెడ రేణుక, మట్టరాని, సుమతి, జనాబాయి. మాజీ జడ్పీటీసీ యాదగిరిగౌడ్‌, స ర్వర్‌పాషా, మాజీ  ఏఎంసీ చైర్మన్‌ అంజన్‌రావు, బాల య్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామా ధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మాజీ సర్పంచ్‌కు పరామర్శ  

మండలంలోని తెర్లుమద్ది గ్రామ మాజీ సర్పంచ్‌ ఈస రి కృష్ణ కుటుంబీకులను టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మండల ప్రజాప్రతినిధులు పరామర్శించారు. 10 రోజల క్రితం కృష్ణ తండ్రి నర్సయ్య మృతిచెందారు. 


ఏకగ్రీవానికి సహకరించాలి: ఆగయ్య

ఎల్లారెడ్డిపేట: సహకార సంఘాల పాలకవర్గాలను సాధ్యమైన మేర ఏకగ్రీవం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఎ లాంటి వైశమ్యాలు లేకుండా ప్రతి ఎన్నికకూ సహకరించిన కార్యకర్తలు ఇప్పుడు కూడా సహకరించాలని  కోరారు. రైతు సంక్షేమానికి, అభివృద్ధికి ఉద్దేశించిన ఎన్నిక కావున, దానిని పదవిలా కాకుండా బాధ్యత లా భావించాలని వివరించారు. మండలంలో ఎల్లారెడ్డిపేట, అల్మాస్‌పూర్‌, తిమ్మాపూర్‌ మూడు సొసైటీల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఆర్‌ఎస్‌ఎస్‌ మండ లాధ్యక్షుడు శంకర్‌, మాజీఎంపీపీ మోహన్‌, ఏఎంసీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మాజీ చైర్మన్‌ అందె సుభాశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణహరి, సర్పంచ్‌లు, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రమేశ్‌, బాలమల్లయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


logo