గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Feb 04, 2020 , 02:00:52

ఆరోగ్య తెలంగాణే ధ్యేయం

ఆరోగ్య తెలంగాణే ధ్యేయం

ఎల్లారెడ్డిపేట: ఆరోగ్య తెలంగాణే ప్రభత్వ ధ్యేయమని టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన చాకలి రాజయ్యకు 18వేలు, బి.రాజుకు 60 వేలు, పోకల పద్మకు 27వేలు మంజూరు కాగా, సంబంధిత చెక్కుల ను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌ మానవీయ కోణంతో ఆలోచించి ఎంతోమంది పేదలకు ఆరోగ్యం కోసం సాయం అందించారని కొనియాడారు. ప్రభుత్వపరంగా పేదల ఆరోగ్యానికి భరోసాను కల్పించేలా సర్కారు దవాఖానల తీరుతెన్నులను మార్చుతున్నారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అలాగే దుమాలకు చెందిన నిమ్మల సతీశ్‌కు మంజూరైన 14వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఏఎంసీ చైర్మన్‌ గుళ్లపల్లి నర్సింహారెడ్డి అందజేశారు. ఇందులో ఎంపీటీసీ ల ఫోరం మండలాధ్యక్షుడు మామిండ్ల తిరుపతిబాబు, దుమాల సర్పంచ్‌ కదిరె రజిత, వైస్‌ ఎంపీపీ కదిరె భాస్కర్‌, వెంకటాపూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు సల్వాజి శ్రీనివాసరావు, నాయకులు కోల నర్సయ్య, పులి రమేశ్‌, కొలనూరి శంకర్‌, బత్తిని శ్రీనివాస్‌, రేండ్ల హన్మంతు, మేడిశెట్టి శ్రీనివాస్‌, మేడిశెట్టి మల్లేశం, కదిరె శ్రీనివాస్‌, మరాఠి స్వామి, దేవయ్య, నాగుల శ్రీను, సునీల్‌, రాజేందర్‌, మధు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

పేదలకు అండగా ప్రభుత్వం

గంభీరావుపేట: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటున్నదని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోతె రాజిరెడ్డి అన్నారు. సముద్రలింగాపూర్‌కు చెందిన కొమ్మలపల్లి పోశయ్యకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 20వేల చెక్కును లబ్ధిదారుడికి అందజేసి, మాట్లాడారు. ఆరోగ్య తెలంగా ణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనారోగ్యంతో కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం చేయడం అభి నందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కమ్మరి రాజారాం, దుబ్బాక మల్లేశం, ఎర్ర ఎల్లాగౌడ్‌, ఎర్ర రామాంజగౌడ్‌, భాస్కర్‌, రంజాన్‌, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.ఇల్లంతకుంట:  పెద్దలింగాపూర్‌కు చెందిన అమ్ముల హరీశ్‌కుమార్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన 27,500 చెక్కును సర్పంచ్‌ గొడిసెల జితేందర్‌గౌడ్‌ అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఎద్దు కుమార్‌ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo