మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Feb 04, 2020 , 02:00:52

ఎములాడకు పోటెత్తిన భకులు

ఎములాడకు పోటెత్తిన భకులు

వేములవాడకల్చరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదటగా రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆ చరించి, తలనీలాలను సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు  నిర్వహించు కున్నారు. కోడెమొక్కులు, కల్యాణ మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. రాజన్నను దాదాపు 50వేల మంది భక్తులు దర్శించుకోగా, ఆలయానికి రూ.23లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల వద్దా భక్తుల సందడి కనిపించింది. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఆవాంఛనీ య సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

రామగుండం ఎమ్మెల్యే చందర్‌ పూజలు

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని రామంగుండం ఎ మ్మెల్యే కోరుకంటి చందన్‌ కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన ఆర్చకుడు ముందుగా ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలను చేయించా రు. కోడెమొక్కును చెల్లించుకున్నారు. అనంతరం గర్భగుడిలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొని ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయన ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. 


logo