శుక్రవారం 29 మే 2020
Rajanna-siricilla - Feb 04, 2020 , 01:53:55

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలించాలి

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలించాలి

కలెక్టరేట్‌: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్‌ మాత్రలను వేసి నులిపురుగులను నిర్మూలించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. ఈనెల 10 నుంచి నిర్వహించనున్న ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం’పై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. నులి పురుగులు కలిగి ఉన్న పిల్లలు రక్తహీనత, పోషకాహా ర లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, బలహీనత, వికారం, వాం తులు, బరువు తగ్గడం, అతిసారం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడతారని వివరించారు. ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తామని తెలిపారు. 1 నుంచి 5 ఏళ్లలోపు పి ల్లలందరికీ అంగన్‌వాడీల్లో, 6 నుంచి 19ఏళ్ల పిల్లలందరికీ ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, బడికి వెళ్లని పిల్లలకు వారి నివాస ప్రాంతాలకు వెళ్లి మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఆల్బెండజోల్‌ మాత్రలతో నులి పురుగులను నిర్మూలించవ్చని వివరించారు. ఫిబ్రవరి 10న అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో పంపిణీ చే యాలని, ఇంటికి తీసుకెళ్లడానికి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆల్బెండజోల్‌ మాత్రలు పిల్లల్లో రక్తహీనతను నియంత్రిస్తుందని, పోషకాహార గ్రా హ్యతను మెరుగుపరుస్తుందని, పని సామర్థ్యాన్ని పెంచుతుందని వివ రించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోని పిల్లలందరికీ మాత్రలు పంపిణీ చేయాలని అధి కారులను ఆదేశించారు. మాత్రలపై తల్లులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో స్వశక్తి సంఘ మహిళలతో స మావేశాలు నిర్వహించాలన్నారు. మాత్రల వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లే వని, భోజనం చేసిన తర్వాత పిల్లలకు మాత్రలు వేయించాలన్నారు. అ నంతరం నులిపురుగుల నిర్మూలనపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చం ద్రశేఖర్‌, డీఈవో రాధాకిషన్‌, డీపీఆర్వో దశరథం, డీఎస్‌సీడీవో రాజేశ్వ రి, సంక్షేమ అధికారి ఎల్లయ్య, మెడికల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. 


logo