గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Feb 02, 2020 , 00:41:36

నిర్వాసితులకు అండగా ఉంటాం

నిర్వాసితులకు అండగా ఉంటాం

వేములవాడ రూరల్: శ్రీ రాజరాజేశ్వర జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామనీ, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే రమేశ్‌బాబును భరోసా ఇచ్చారు. వేములవాడ అర్బన్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఆయనను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కలిశారు. ముంపు బాధితుల సమస్యలను చెన్నమనేనికి విన్నవించారు. జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ మాట్లాడుతూ, ముంపు గ్రామాలకు సం బంధించి ఇంకా పది శాతం సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా భూ పరిహారం, ఇండ్ల పరిహారంతో పాటు అసైన్డ్ భూము ల పరిహారం కూడా కొంతమందికి అందాల్సి ఉం దని వివరించారు. ఆ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వెంటనే ఫోన్ చేసి ముంపు గ్రామాల సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రమేశ్‌బాబు మాట్లాడుతూ త్వరలోనే కలెక్టర్, ఆర్డీవోతో ముం పు గ్రామాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపురెడి, వైస్ ఎంపీపీ ఆర్‌సీరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, సర్పంచులు వెంకటరమణ, రేగులపాటి రాణిహరిచరణ్‌రావు, జింక సునీతావేణు, ఇటిక్యాల నవీనరాజు, రంగు సత్తమ్మరాములు, నాయకులు బూర బాబు, మాజీ ఉప సర్పంచ్ చిట్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు ఎమ్మెల్యేను కలిశారు.


logo