శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Feb 02, 2020 , 00:39:56

ప్రగతి భవన్‌లో కలిసిన లారీ అసోసియేషన్ సభ్యులు

 ప్రగతి భవన్‌లో కలిసిన లారీ అసోసియేషన్ సభ్యులు
  • మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంపై సంతోషం

గంభీరావుపేట: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో లారీ అసోసియేషన్ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు శనివా రం మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సాధించిన ఘన విజయంపై వారు సంతోషం వ్యక్తంచేశారు. కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని లారీ అసోసియేషన్ పక్కా భవనానికి స్థలం కేటాయించాలని వారు కేటీఆర్‌ను కోరారు. అమాత్యుడు సానుకూలంగా స్పందించారని లారీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కొమిరిశెట్టి లక్ష్మణ్, లారీ అసోసియేషన్ మండలాధ్యక్షుడు వహీద్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

కిషన్‌రావు కుటుంబానికి పరామర్శ

ఎల్లారెడ్డిపేట: మండలంలోని కొరుట్లపేటకు చెం దిన ఏ1 కాంట్రాక్టర్ తూంనూరి కిషన్‌రావు(68) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మృతిచెందాడు. మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలుసుకుని దవాఖానకు వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం కిషన్‌రావు కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. 40 సంవత్సరాలుగా ఏ1 కాంట్రాక్టర్‌గా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, చెరువులను నిర్మిం చే కాంట్రాక్టర్ కిషన్‌రావు మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది.


logo