సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Feb 01, 2020 , 02:02:13

బీడీ కార్మికుల ‘ఆధారం’పై ఏజెంట్ల దందా..

బీడీ కార్మికుల ‘ఆధారం’పై ఏజెంట్ల దందా..
  • పింఛన్‌ కోసం పీఎఫ్‌ దరఖాస్తుదారుల అవస్థలు
  • జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి పైగా కార్మికులు
  • ఒక్కొక్కరి నుంచి 2వేలకు పైనే వసూలు
  • మార్పులు చేయిస్తామంటూ దండుకుంటున్న ఏజెంట్లు
  • నియామక పత్రాలు, ఆధార్‌లో వేర్వేరుగా తేదీలు

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్‌) : జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి (పేరు మా ర్చాం) బీడీ కార్మికురాలు. 1985లో బీడీ కార్మికురాలిగా స్థానికంగా ఓ కంపెనీలో చే రింది. ఆసమయంలో సదరు కంపెనీ ఏజెంటు ఆ మె వయస్సు ను అనామత్‌గా జూన్‌ 1, 1961గా రికార్డులో న మోదు చేశాడు. కంపెనీ వారు అదే తేదీతో ఆమెకు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చా రు. ఏళ్ల తరబడి బీడీలు చుట్టిన లక్ష్మి అనారోగ్యం తో 2012లో పని ఆపేసి గ్రాడ్యుటీ డబ్బు తీసుకున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్‌లో ఎన్నికల గుర్తింపు కార్డు ఆధారంగా ఆమె వయస్సును జనవరి 1, 1968గా నమోదు చేశారు. 1961 తేదీ ప్రకారం 58 ఏళ్లు నిం డడంతో పింఛన్‌ కోసం స దరు కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. కంపెనీ రికార్డుల ప్రకారం పీఎఫ్‌ రికా ర్డులో పుట్టిన తేదీకి, ఆధార్‌లో పుట్టిన తేదీకి సరిపోలడం లేదనీ, పీఎఫ్‌ కార్డులో ఉన్న విధంగా పుట్టిన తేదీ, పేరు ఉండేలా ఆధార్‌లో సవరణ చేసుకొని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ నుంచి లెటర్‌ వచ్చింది. ఇక్కడే లక్ష్మికి పెద్ద చిక్కు వ చ్చింది. 


పీఎఫ్‌ కార్డులో ఉన్న విధంగా ఆధార్‌లో పుట్టిన తేదీ మార్చుకోవాలంటే సపోర్ట్‌ డాక్యుమెంట్‌గా తన వద్ద ఏ ధ్రువీకరణ ప త్రమూ లేదు. ఎలక్షన్‌ కార్డులో వేరే పుట్టిన తేదీ ఉంది. జనన, మరణ రికార్డులు లేనందున 1961లో పుట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శి ధ్రు వీకరణ పత్రం ఇవ్వలేడు. ఇక తాను తేవాల్సింది ‘నాన్‌ అవైలెబులిటీ సర్టిఫికెట్‌'. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలంతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత తాసిల్దార్‌ ద్వారా ఆర్డీవో కు చేరుతుంది. ఆయన విచారణ చేపట్టి సదరు ద రఖాస్తును ఆమోదిస్తే ఆ ధ్రువీకరణ పత్రంతో ఆ ధార్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికావాలంటే 45 రోజుల నుంచి 3 నెలలు పడుతుంది. కానీ ఈ విధానం చాలా మం ది చదువుకున్న వారికీ తెలియదు. నిరక్షరాస్యుల పరిస్థితి వర్ణనాతీతం. ఇది ఒక్క లక్ష్మి పరిస్థితే కాదు. జిల్లాలో సుమారు 50 వేల మంది బీడీ కా ర్మికులుండగా వారిలో 70 శాతం మందిని ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇదే అదునుగా చేసుకొని కొందరు కంపెనీ ఏజెంట్లు ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకులతో కుమ్మక్కై కార్మికుల నుంచి పుట్టినతేదీ మార్పుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తూ వారి ‘ఆధారం’పై దందా చేసుకుంటున్నారు.


నిరక్షరాస్యత,అమాయకత్వమే ‘ఆసరా’

జిల్లాలో మెజార్టీ మహిళలు బీడీలు చుడుతూ జీవనాధారం పొందుతున్నారు. సిరిసిల్లతో పాటు మండలాల్లోని గ్రామాల్లో అధిక సంఖ్యంలో బీడీ లు చుట్టే కార్మికులు ఉన్నారు. వీరిలో మధ్యతరగ తి, వెనుకబడిన వర్గాల మహిళలు, అందులోనూ నిరక్షరాస్యులే అధికం. వారు సదరు కంపెనీలో చే రేముందే కంపెనీలు వారి వ్యక్తిగత వివరాలు న మోదుచేసుకుని కార్మిక, పీఎఫ్‌ శాఖలకు అందిస్తాయి. కానీ వారు నమోదు చేసిన వివరాలు ఆ ధార్‌లోని పేరు, పుట్టిన తేదీ వివరాలు చాలా మం దికి సరిపోవట్లేదు. ఇన్ని రోజులూ ఇది సమస్యగా కనిపించకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. బీడీ కార్మికుల పీఎఫ్‌ వివరాలు పేరు, పుట్టినతేదీ లు కచ్చితంగా ఆధార్‌తో సరిపోక పోతే పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ జరగదనీ, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ పూర్తయ్యాక పెన్షన్‌ అందడం కష్టమనీ, కాబట్టి పీ ఎఫ్‌ కార్డుల్లో వివరాలకు అనుగుణంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవాలని పీఎఫ్‌ శాఖ కంపెనీలకు సూచించింది. సదరు కంపెనీ వారు ఏజెంట్ల ద్వా రా కార్మికుల పీఎఫ్‌ వివరాలకు అనుగుణంగా ఆ ధార్‌లో మార్పులు చేసేలా చూడాలని చెప్పడం తో మహిళలకు ఆధార్‌ రూపంలో సమస్యలు ఎ దూరవుతున్నాయి. చదువుకున్న కార్మికులైతే స్టడీ సర్టిఫికెట్లతో సులభంగా ఆధార్‌లో మార్పులు చే సుకుంటున్నారు. 


కానీ నిరక్షరాస్యులు, 30 నుంచి 50ఏళ్ల వయస్సున్న మహిళలకు ఆధార్‌ మార్పు లు చాలా కష్టంగా మారింది. ఇటు ఎలక్షన్‌ కా ర్డులో వివరాలు వేరుగా ఉండడం, అటు పంచాయతీల్లో జనన రికార్డుల్లో వివరాలు అందుబాటు లో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ తమ జీవనాధారంపై దెబ్బ పడుతుందోనని భయపడుతున్నారు. దీనిని ఆసరా చే సుకున్న ఏజెంట్లు, కొందరు ఆ భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మీ సేవా, ఆధార్‌ కేంద్రాల ని ర్వాహకులతో కుమ్మక్కై ఒక్కో కార్మికురాలి నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల దాకా దండుకొని ఆ ధార్‌లో మార్పులు చేయిస్తున్నారు. నిరక్షరాస్యులను టార్గెట్‌ చేసుకుని ఆధార్‌లో మార్పులు చేయిస్తామంటూ వేలకు వేలు వెనకేసుకుంటున్నారు. వైద్యుల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం, బోగస్‌ ధ్రువీకరణ పత్రాలను సృష్టించ డం ద్వారా ఆధార్‌లో మార్పులు చేస్తున్నారు. కొం దరు నిర్వాహకులు కార్మికులకు ముందుగా ఎఫ్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా పాన్‌కార్డు దరఖాస్తు చేసి ఆధార్‌లో మార్పులు చేస్తున్నారు. 


ఆధార్‌ మార్పులు సక్రమమేనా?

జిల్లాలోని ఆధార్‌ సెంటర్లలో జరిగే అన్ని ఆధార్‌ మార్పులు సక్రమంగానే జరుగుతున్నాయా.? అనే సందేహం వ్యక్తమవుతున్నది. నాలుగు నెలల క్రితం ఆధార్‌లో మార్పులకు పాల్పడుతున్న ఓ కేంద్రం నిర్వాహకుడికి నోటీసులు అందించినట్లు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు తంగళ్లపల్లి మడలంలోని ఓ మీసేవాకేంద్రంగా ఇలాంటి కా ర్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, దళారులతో కుమ్మక్కై నిర్వాహకులు పెద్ద ఎత్తున సొ మ్ము చేసుకుంటున్నారని తెలుస్తున్నది. ఒకవేళ బో గస్‌ పత్రాలతో ఆధార్‌ మార్పులు చేస్తే చేసుకున్నవారికి, నిర్వాహకులకు ఆధార్‌ చట్టం ప్రకారం శిక్షపడే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆధార్‌ చ ట్టం 2019 ప్రకారం జీవితకాలంలో పేరు, లిం గం కేవలం ఒకసారి, పుట్టిన తేదీని రెండుసార్లు మాత్రమే సవరించుకునే వీలుంది. కాబట్టి ఆధార్‌లో సవరణలు చేసుకునే వారు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలనీ, సరైన ధ్రువీకరణ పత్రాలతోనే సవరణ చేసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 


పాన్‌కార్డుకు దరఖాస్తులు..

మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులకు ముందుగా పీఎఫ్‌లో ఉన్న పుట్టినతేదీ ఆధారంగా పాన్‌కార్డు దరఖాస్తు చేస్తున్నారు. తద్వారా కార్మికురాలికి మం జూరైన పాన్‌కార్డు ఆధారంగా ఆధార్‌ కార్డులో వా రి పుట్టిన తేదీలను మార్పు చేస్తున్నారు. ఈ క్ర మంలో కొన్ని చోట్ల నకిలీ ఓటరు గుర్తింపు కార్డు ను సైతం తయారుచేస్తున్నట్లు తెలుస్తున్నది.  


‘మామూలు’గానే తనిఖీలు..

మీ సేవా కేంద్రాలు అడ్డాగా చాలా కాలంగా ఈ దందా కొనసాగుతున్నది. ఫిర్యాదులు వచ్చినప్పు డు ‘మామూలు’గా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖులు సైతం కుటుంబ స భ్యుల పెన్షన్‌ కోసం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు డబ్బులు చెల్లించడం గమనార్హం. విషయంపై బాధితుల వివరణ కోరగా మళ్లీ తమకు పింఛన్‌ రాకుండా చేస్తారేమోనన్న భయంతో ఫిర్యాదు చే సేందుకు కూడా నిరాకరిస్తున్నారు.