గురువారం 16 జూలై 2020
Rajanna-siricilla - Feb 01, 2020 , 01:57:03

అపరిశుభ్రతపై కలెక్టర్‌ ఆగ్రహం

అపరిశుభ్రతపై కలెక్టర్‌ ఆగ్రహం
  • రాజన్న ఆలయ పరిసరాలను పరిశీలించిన కృష్ణభాస్కర్‌
  • ‘చెత్త’ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌
  • ఈవో, ఏఈవోలకు సంజాయిషీ నోటీసులు

వేములవాడ, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలోనే అతిపెద్ద పు ణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి నిత్యం రాష్ట్ర న లుమూలల నుంచి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నా వసతి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు నిరక్ష్యం చేయడంపై కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. పట్టణంలోని ప్రధాన ఆలయం వీధిలో ఆయన శుక్రవారం కాలినడకన నడుస్తూ పరిసరాలను పరిశీలించారు. చెత్త పేరుకుపోయి ఉండడం చూసి అధికారులపై మండిప డ్డారు. సమక్క-సారలమ్మ జాతర వెళ్లే భక్తులు మొదట రా జన్నను దర్శించుకోవడం అనవాయితీ. ఈ నేపథ్యంలో 15 రోజులుగా వేములవాడ పట్టణం సమక్క భక్తులతో కిక్కిరిసిపోతున్నది. ఈ నేపథ్యంలో వసతి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర దేవాదాయశాఖ, జిల్లా పాలానాధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కమిషనర్‌ అనిల్‌కుమార్‌ క్షేత్రస్థాయి పర్యటన చేసిన మరోసటి రోజునే కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కూడా పరిశీలించి తీవ్రం గా పరిగణించారు. ఆలయ ఈవో కృష్ణవేణి, ఏఈవో ఉ మారాణికి సంజాయిషీ నోటీసును జారీచేశారు. పారిశు ధ్యం వ్యవహారంలో ఆలయ పారిశుధ్య విభాగం ఉద్యోగులను కార్యనిర్వహణాధికారి సస్పెన్షన్‌ చేశారు. 


15రోజులుగా వేములవాడలో జన జాతర

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి గడిచిన 15రోజులుగా వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయ విస్తరణకు సేకరించిన గుడిచెరువు ఇప్పటికే వాహనాలతో నిండిపోతుండగా వచ్చిన భక్తులతో  పట్టణ పురవీధులు జన జాతరను తలపిస్తున్నాయి. దాదాపుగా 10లక్షల మంది భక్తులు ఇప్పటికే రాజన్నను దర్శించుకున్నట్లుగా ఆలయవర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లను కూడా చేపట్టాల్సి ఉంటుంది. 


సౌకర్యాల లోటుపై ఫిర్యాదుల వెల్లువ

రాజన్న సన్నిధికి లక్షలాదిగా తరలివస్తున్నా అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు వసతి సౌకర్యాలను చేపట్టడంలో విఫలమయ్యారని భక్తులు పెద్దెత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, క్యూలైనులో సరైన వసతుల్లేవని రాష్ట్ర దేవాదాయశాఖ, జిల్లా పాలనాధికారికి సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. ఆలయ పరిసరాల్లోనూ సౌకర్యాలు కల్పించ డం లేదని భక్తులు అసహనానికి గురవుతూ ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది. ఇక పార్కింగ్‌, ఆలయ ప్రధాన వీధు ల్లో భక్తులు ముక్కు పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఏర్పడడం వల్లే ఫిర్యాదుల వెల్లువ వెళ్లిత్తినట్లు సమాచారం. 


డంప్‌యార్డులా దక్షిణద్వారం

ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఆలయ అధికారులు ప్రధాన రహదారి వైపులో ఉన్న దక్షిణద్వారం నుంచి భక్తులను బయటకు అనుమతిస్తారు. ఈ నే పథ్యంలో దక్షిణద్వారం వద్ద డంప్‌యార్డుల తలపించే వి ధంగా చెత్త పేరుకపోయింది. సాక్షాత్తూ జిల్లా పాలానాధికారి కృష్ణభాస్కర్‌ శుక్రవారం వేములవాడకు చేరుకొని ఆ చెత్తను చూసి అధికారులపై ఆగ్రహానికి లోనయ్యారు. కనీ సం పారిశుధ్యానికైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈవో కృష్ణవేణిపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే సం బంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సిబ్బందితో రావాలని కలెక్టర్‌ ఆదేశించగా వెంటనే చేరుకొని చెత్త ను మూడు వాహనాల్లో తరలించి శుభ్రపరిచారు.  రాష్ట్ర దే వాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించిన మరుసటి రోజే పరిస్థితుల్లో మార్పు లేకపోవడాన్ని కలెక్టర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. 


ఈవోకు సంజాయిషీ నోటీసు.. 

ఈ నేపథ్యంలో కార్యనిర్వహణాధికారి కృష్ణవేణికి, ఏఈ వో ఉమారాణిను సంజాయిషీ కోరుతూ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ నోటీసును జారీచేశారు. భక్తులకు దర్శనానికి సరైన వసతి కల్పించకపోగా, పారిశుధ్య నిర్వహణ కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నందున వెంటనే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆ మెమోలో స్పష్టంచేశారు. 


ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

ఆలయ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో ఇద్దరు ఉ ద్యోగులపై వేటు పడింది. అందులో పారిశుద్ధ్య నిర్వహణ విభాగం పర్యవేక్షకులు గౌరిశంకర్‌, రికార్డు అసిస్టెంట్‌ రవిని సస్పెండ్‌ చేస్తూ ఈవో కృష్ణవేణి ఉత్తర్వులు జారీచేశారు.  


logo