గురువారం 04 జూన్ 2020
Rajanna-siricilla - Feb 01, 2020 , 01:55:47

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

వీర్నపల్లి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పల్లెలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని టె స్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పిలుపు నిచ్చారు. మండలంలోని 10గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ల పం పిణీ కార్యక్రమాన్ని జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లకు ట్రాక్టర్లను అందజేశారు. అనంత రం కొండూరి మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణ ని ర్మాణమే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించారని తెలిపారు. పారిశు ధ్య నిర్వహణకు ట్రాక్టర్ల పంపిణీ చేపడుతున్నారని వివరించారు. మొక్కలకు నీటి అందించేం దుకు కూడా ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అ ధికార ప్రతినిధి తోట ఆగయ్య, బంజారా సం ఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సురేష్‌నాయక్‌, జడ్పీ కో ఆప్షన్‌ చాంద్‌పాషా, ఆర్‌ఎస్‌ఎస్‌ మండ ల కో ఆర్డినేటర్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు బోయిన రవి, సర్పంచ్‌లు రజిత, దినకర్‌, కళ, జగ్మల్‌, లింగం, లక్ష్మీరాజం, కరుణ, శ్రీనివాస్‌, లత, ఎంపీటీసీ పద్మ, నాయకులు సం తోష్‌, భాస్కర్‌, రామస్వామి పాల్గొన్నారు.  


logo