శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Feb 01, 2020 , 01:50:13

సర్కారు దవాఖాన సందర్శన

సర్కారు దవాఖాన సందర్శనసిరిసిల్లటౌన్‌ :  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానను శుక్రవారం జిల్లా సంక్షేమశాఖ అధికారి రాహుల్‌శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ, డయాలసిస్‌, బ్లడ్‌బ్యాంక్‌, ఇన్‌వార్డ్సు, రిసెప్షన్‌లో రోగులకు అందుబాటులో ఉన్న సేవలతో పాటు అవసరమైన మౌలిక వసతులపై జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి రా హుల్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సేవలు జిల్లా హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆధునిక వైద్యసేవలను సర్కారు దవాఖానలో అందుబాటులోకి తీసుకువస్తున్నదని చెప్పారు. 


కార్పొరే ట్‌ హాస్పిటల్‌లకు దీటుగా జిల్లా దవాఖానలో డయాలసిస్‌, బ్లడ్‌బ్యాంక్‌, ఐసీయూ సేవలు అం దిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ హాస్పిటల్‌లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సౌ కర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు మాట్లాడుతూ జిల్లా దవాఖానలో ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచామని అన్నారు. సి బ్బంది కొరతతో పాటుగా మరిన్ని మౌలిక వసతు లు కల్పించాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి దృ ష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామ ని ఆయన తెలిపినట్లు చెప్పారు. ఇక్కడ వైద్యులు డాక్టర్‌ తిరుపతి, సిబ్బంది ఉన్నారు. 


logo