గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jan 31, 2020 , 03:01:09

ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
  • వినూత్న విధానాలతో మెరుగైన సేవలు
  • కొలువుదీరిన పాలకవర్గాలు అభినందనల వెల్లువ
  • సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి
  • మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తాం


సిరిసిల్ల టౌన్‌: మంత్రి కేటీఆర్‌ ఆశయాలకు అనుగుణం గా సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యం గా పనిచేస్తామని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ ఉద్ఘాటించారు. మున్సిపల్‌ కార్యాలయంలో పాలకవర్గ స భ్యుల సమక్షంలో చైర్‌పర్సన్‌గా ఆమె పదవీ బాధ్యతలను గురువారం స్వీకరించారు. అనంతరం అధ్యక్షురాలు కళ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సి రిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దశాబ్దాల సిరిసిల్ల మున్సిపల్‌ చరిత్రలో ప్రభుత్వాలు, పాలకులు మారినా అభివృద్ధిలో ఎలాంటి మార్పు జరగలేదని, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే, కేటీఆర్‌ మున్సిపల్‌ శా ఖమంత్రిగా దశల వారీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తున్నార ని వివరించారు. చరిత్రలో లేని విధంగా ఐదేండ్ల పాలనలోనే రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేసి కార్మికక్షేత్రమైన సిరిసిల్లను అభివృద్ధికి ఐకాన్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. 


అంబేద్కర్‌, గాంధీచౌరస్తా, ఎల్లమ్మ జంక్షన్ల సుందరీకరణ, రోడ్లవెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుతో కార్మిక క్షేత్రానికి కొత్త కళ వచ్చిందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ కోసం మానేరుతీరంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్‌కు ఖండాంతరాల నుంచి ప్రశంసలు వచ్చాయని గుర్తుచేశా రు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా శివనగర్‌, వెంకట్రావునగర్‌, ఇందిరానగర్‌, నెహ్రూనగర్‌, జేపీనగర్లలో ఏర్పాటు చేసిన పార్క్‌లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. మినీట్యాంక్‌ బం డ్‌ కాన్సెప్ట్‌తో చేపట్టిన కొత్త చెరువు పనులు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి రామప్ప ఆలయం వరకున్న మానేరుతీరం వెంట జరగుతున్న కరకట్ట నిర్మాణ పనులు పూర్తయితే సిరిసిల్లకు పర్యాటక శోభ రానుందని తెలిపారు. 


సిరిసిల్ల అంబేద్కర్‌చౌక్‌లో ఏర్పాటుచేసిన సినారె గ్రంథాలయం రాష్ర్టానికే తలమానికంగా నిలిచిపోయిందన్నారు. భవిష్యత్‌ కాలంలోనూ మంత్రి కేటీఆర్‌ సహకారంతో తమ పాలకవర్గం హయాంలో సిరిసిల్ల ను మరింత అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. వి నూత్నమైన విధానాల అమలుతో ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి కాలనీల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరినీ భాగస్వాములను చేసుకుని రాష్ర్టానికి ఆదర్శంగా సిరిసిల్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌, ప్రజలందరి సహకారంతో తమకు ఈ అవకాశం వచ్చిందని, బాధ్యతగా ఉంటూ మె రుగైన సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కా ర్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సామల పావని, ము న్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


పాలకవర్గానికి శుభాకాంక్షల వెల్లువ

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌తో పాటు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మున్సిపల్‌ కార్యాలయంలో పలువురు నాయకులు వారిని కలిసి  శాలువాలతో సత్కరించారు. వారిలో టీఆర్‌ఎస్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, సెస్‌ వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్‌, బీసీ సెల్‌ నాయకుడు రామ్మోహన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, ము న్సిపల్‌ మాజీ అధ్యక్షురాలు సామల పావని, మాజీ ఉపాధ్యక్షుడు కనకయ్య, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జూపల్లి నాగేందర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధానకార్యదర్శి రవి, సామల దేవదాస్‌, టీఆర్‌ఎస్‌వై పట్టణాధ్యక్షుడు మనోజ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హరీశ్‌లతో పాటు తదితరులున్నారు. 


మహాత్ముడికి ఘన నివాళి..

అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో మహాత్మగాంధీ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటం వద్ద మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, ఉపాధ్యక్షుడు మంచె శ్రీనివాస్‌ పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ కమీషనర్‌ వెల్దండి సమ్మయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు చందన, అ న్నారం శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ దార్ల సందీప్‌, భగవాన్‌ పాల్గొన్నారు. 


logo