గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jan 31, 2020 , 02:59:33

చైతన్యం పెంచాలి

చైతన్యం పెంచాలి
  • కుష్ఠు రహిత జిల్లాగా మార్చాలి
  • జిల్లా కేంద్రంలో నివారణ అవగాహన ర్యాలీ
  • కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
  • సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం

సిరిసిల్ల టౌన్‌: కుష్ఠు వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వ దవా ఖానల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందనీ, దీనిపై ప్రజల్లో చైతన్యం పెంచాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచించారు. కుష్ఠు వ్యాది నివారణ దినోత్సవాన్ని పు రస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హా జరై ర్యాలీని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యా ధిగ్రస్థులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాల ని, జిల్లాను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కుష్ఠు వ్యాధి బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధని, ఇది ఎవరికైనా రావచ్చని, చ ర్మానికి, నరాలకు సోకుతుందని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి, బహుళ ఔషధ చికిత్స ద్వారా 6నెలల నుంచి 12నెలల్లోపు పూ ర్తిగా నయమవుతుందని తెలిపారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది కుష్ఠు వ్యాధిగ్రస్థులకు అంకితభావంతో చికిత్స అందించాలని సూచించా రు. జిల్లాలో కేవలం ఒక్కరు మాత్రమే కుష్ఠు వ్యాధిగ్ర స్తుడు ఉన్నాడని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ప్రత్యేక కార్యచరణతో సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 13వరకు అన్ని మండలాల్లో స్పర్శ శీర్షికన ‘చేతులు కలపండి-కుష్ఠు వ్యాధిని నిర్మూలించండి’ అనే నినాదంతో కుష్ఠుపై అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మైకో బాక్టీరియా లెప్రసె అనే సూక్ష్మ క్రిమీ వల్ల వ్యాధి సోకుతుందని, లక్షణాలు బహిర్గతం కావడానికి మూడేళ్లు పడుతుందని వివరించారు. శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు ఉన్నా, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం, చెవు లు, ఛాతిపై కణుతులు, బుడిపెలు రావడంతో పాటు ముఖం నూనె రంగులో సన్నగా మారడం, చేతులు, కాళ్లు పొడిగా ఉండడం, వాపు, స్పర్శ కోల్పోవడం, కం డరం చిక్కిపోవడం, చిటికెన వేలు, బొటన వేలు సన్నబడడం, మణికట్టు లేక మడమపైకి లేప లేకపోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సం ప్రదించాలని తెలిపారు. ముక్కు అణిగి ఊపిరి పీల్చడం కష్టమైన సందేహించాలని తెలిపారు. బహుళ ఔషధ చి కిత్స(ఎండీటీ)తో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, అన్ని ప్రాథమక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స లభిస్తుందని, 6నుంచి12నెలల్లో పూర్తిగా వ్యాధి నయమవుతుందని వెల్లడించారు. అనంతరం అవగాహన ర్యాలీలో పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ ప్రతిజ చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి, కుష్ఠు ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, జి ల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రా వు, డీపీఆర్వో మామిండ్ల దశరథం పాల్గొన్నారు. 


logo