గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jan 31, 2020 , 02:56:18

సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖీ

సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖీ

కోనరావుపేట: మండలంలోని సుద్దాలలోని జిన్నింగ్‌ మిల్లులో ఏర్పాటు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెటింగ్‌ జేడీ మల్లేశం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. పత్తి అమ్మకాలు, దిగుబడి, రైతు ధ్రువీకరణ పత్రాలు, ఆన్‌ లైన్‌ ద్వారా తక్‌ పట్టిల జారీని ఆయన స్వయంగా పరీశీలించారు. అనంతరం జేడీ మల్లేశం మాట్లాడుతూ రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే పత్తిని నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. పత్తిని విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులను వెంట వెంటనే జమ చేయాలని, నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఎండీ షాబొద్దీన్‌ తదితరులున్నారు.


logo