గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jan 31, 2020 , 02:56:18

ఆర్టీసీలో ‘ఫ్యామిలీ కౌన్సెలింగ్‌-డే’

ఆర్టీసీలో ‘ఫ్యామిలీ కౌన్సెలింగ్‌-డే’

కలెక్టరేట్‌:  రోడ్డు ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా గురువారం రోజున సిరిసిల్ల డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ‘ఫ్యామిలీ కౌన్సిలింగ్‌-డే’ను నిర్వహించారు. పలువురు డ్రైవర్ల కుటుంబాలను పిలిచి పలు సూచనలు, సలహాలు స్వీక రించారు. తొ లుత వారికి గాజులు, తాంబూళం, చీర, పసుపు కుంకుమ, తమలపాకు లు అందజేసి సన్మానించారు. డ్రైవర్‌ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో ‘భద్రతా సూక్తి’ని పాటిస్తామని, అం దులో భాగంగా డ్యూటీకి వెళ్లే ముందు “ఈ రోజు నేను ఎటువంటి ప్రమాదాలకు పాల్పడను. పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమయపాలన పాటిస్తూ ముందున్న వాహనాలను గమనిస్తూ సేఫ్‌ డ్రైవ్‌ చేస్తాను’ అని డ్రైవర్‌తో ప్రతిజ్ఞ చేయిస్తామని వివరించారు. డ్రైవర్‌ ప్రశాంతంగా ఉండేలా చూసేందుకే ఫ్యామిలీ డే నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పలువురు డ్రైవర్‌ కుటుంబసభ్యు లు, ఎస్‌టీఐ జ్యోత్స్న, ఎంఎఫ్‌ స్రవంతి, డ్రైవర్లు పాల్గొన్నారు. 


logo