బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jan 30, 2020 , 03:31:19

అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి

అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి

పారదర్శకమైన పాలన అందించి అభివృద్ధిలో సిరిసిల్లను అగ్రగామిగా నిలపాలని ఐటీ, పురపాలక శాఖల మంత్రి సూచించారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, విప్‌గా నియాకమైన రాపెల్లి దిగంబర్‌ బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించి పలు సూచనలు చేశారు.

  • ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌
  • సిరిసిల్ల మున్సిపల్‌ పాలకవర్గానికి అమాత్యుడి అభినందనలు

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ను అభివృద్ధిలో అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ జిందం, కళ, మంచె శ్రీనివాస్‌తోపాటు విప్‌గా నియాకమైన రాపెల్లి దిగంబర్‌ను అభినందించారు. పారదర్శకమైన పాలన అందిం చి అభివృద్ధిలో సిరిసిల్లను ముందువరుసలో నిలపాలని మంత్రి కేటీఆర్‌ వారికి సూచించారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, తదితర నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు.


logo