శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Jan 29, 2020 , 04:45:50

లక్ష ఎకరాలకు నీరందించి తీరుతాం..

లక్ష ఎకరాలకు నీరందించి తీరుతాం..

కథలాపూర్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పునరుద్ఘాటించారు. కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌, బొమ్మెనలో 30లక్షలతో నిర్మించిన సింగింల్‌విండో సింగిల్‌విండో కార్యాలయాన్ని, గోదామును జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డిలతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటికే 60వేల ఎకరాలకు నీరందించామనీ, వరద కాలువ నుంచి లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మరో 46వేల ఎకరాలకు త్వరలోనే నీరందిస్తామని తెలిపారు. లక్ష ఎకరాలకు నీరిందించడంలో వేములవాడ నియోజకవర్గం అన్నింటికన్నా ముందంజలో ఉందన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువపై 19 లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని చెరువులకు నీళ్లందించేలా ప్రణాళికలను రూపొందించామనీ, వాటిని త్వరంలోనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నెలల్లో మేడిపల్లి మండ ల శివారులోని సూరంపేట ద్వారా గంభీర్‌పూర్‌ చెరువులకు నీళ్లు వచ్చేలా చూస్తాననీ, గంభీర్‌పూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు తనవంతుగా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. గంభీర్‌పూర్‌ గ్రామానికి అదనంగా 15 డబూల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామనీ, అక్కడే హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మ్రార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయనీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పండుగలా చేస్తున్నదని కొనియాడారు. అనంతరం మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన సబ్సిడీ రుణాలను 12 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున పంపిణీ చేశారు. బొమ్మెనలో చేపట్టనున్న పెద్దమ్మ ఆల యం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. గ్రామ శివారులో సమ్మక్క సారాలమ్మ గద్దెల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో కేడీసీ సీబీ వైస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, ఎంపీపీ జవ్వాజీ రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, సింగిల్‌విండో చైర్మ న్‌ దాసరి గంగాధర్‌, సర్పంచులు, ఎంపీడీవో జనార్దన్‌, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ బాపురెడ్డి, సీఈవో శ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ కిరణ్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకర్‌, పొలాస నరేందర్‌, నాగేశ్వర్‌రావు, చీటి విద్యాసాగర్‌రావు, గడ్డం భూమరెడ్డి, గడిల గంగప్రసాద్‌, ఎంజీ రెడ్డి, పిడుగు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, జవ్వాజి గణేశ్‌, శీలం మోహన్‌రెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు. 


logo