గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jan 29, 2020 , 04:41:50

సోలార్‌ గ్రీజర్‌ ఏర్పాటు అభినందనీయం

సోలార్‌ గ్రీజర్‌ ఏర్పాటు అభినందనీయం

సిరిసిల్ల రూరల్‌: విద్యార్థుల సౌకర్యార్థం నేరెళ్ల గురుకుల పాఠశాలలో 10లక్షలతో సోలార్‌ గ్రీజర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జడ్పీటీసీ పుర్మాణి మంజుల కొనియాడారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాలికల గురుకుల పాఠశాలలో అమెరికా తెలంగాణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ రాగిపల్లి శ్రీనివాస్‌రెడ్డి సోలార్‌ గ్రీజర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రిన్సిపాల్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీటీసీ గ్రీజర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రోత్సాహం, దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తాము కోరగానే శ్రీనివాస్‌రెడ్డి సోలార్‌ గ్రీజర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అమెరికా తెలంగాణ ఫౌండేషన్‌ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యానారాయణరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌, పుర్మాణి రాంలింగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు బొబ్బల మంజుల, మాట్ల మధు, ఎంపీటీసీలు కళ, లావణ్య, మాజీ ఎంపీపీ పుసపెల్లి సరస్వతి, పుర్మాణి రాంలింగారెడ్డి, రాగిపల్లి రఘుపతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

కుట్టు శిక్షణను వినియోగించుకోవాలి

మహిళలు కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియో గం చేసుకోవాలని జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఎంపీపీ పడిగె మానస అన్నారు. మంగళవారం వారు జిల్లెల్ల గ్రామంలో సర్పంచ్‌ మాట్ల మధుతో కలిసి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రా న్ని  ప్రారంభించి, మాట్లాడారు. గ్రామంలో ఉచి తంగా కుట్టు మిషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ముందుగా వంద మందికి 100రోజుల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. తర్వాత ైస్టెఫండ్‌తోపాటు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తా మని వారు వివరించారు. మహిళలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, కో ఆప్షన్‌ సభ్యుడు తాజొద్దీన్‌, మోర నిర్మల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo