శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jan 29, 2020 , 04:35:42

సేవాభావం అభినందనీయం

సేవాభావం అభినందనీయం

ముస్తాబాద్‌: సేవాభావం అభినందనీయమని ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. వెంకట్రావుపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, విద్యాభివృద్ధికి చేయూతనిస్తున్న సత్యసాయి ట్రస్టు సేవలను సద్వినియోగం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యాభిమానులు ప్రతి విద్యార్ధికి రూపాయి చెల్లిస్తే ట్రస్టు నిర్వాహకులు మిగతా డబ్బుతో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందిస్తారని తెలిపారు. ఇలాంటి మంచి పథకాన్ని అమలు చేస్తున్న నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్రావుపల్లె పాఠశాలలో సర్పంచ్‌ లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ తిరుపతిరెడ్డి విరాళం చెల్లించడానికి ముందుకురావడంతో సంతోషంగా ఉం దన్నారు. ఈ సందర్భంగా వారు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ పద్మారెడ్డి, హెచ్‌ఎం బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్‌ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


logo