ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Jan 28, 2020 , 02:59:48

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

వేములవాడ కల్చరల్‌: మేడారం జాతర సమీపిస్తుండడంతో  ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి  భక్తుల తాకిడి క్రమేణ పెరుగుతున్నది. సోమవారం వివిధ  ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షలకుపైగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. రాజన్నక్షేత్ర పరిధిలో సందడి నెలకొంది. ఆదివారం  సాయంత్రం నుంచే ఆలయ ప్రాంగణం, పట్టణంలోని ప్రధాన వీధులు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో ఆలయ పరిసరాలు మహాశివరాత్రిని తలపించేలా కనిపించాయి. మహాశివరాత్రి లాగా అనిపించిందని కొందరు పట్టణ వాసులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రల నుంచే గాక, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో వేములవాడ పురవీధులు జనసంద్రమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. గంటల తరబడి ప్రీతి మొక్కైన కోడెమొక్కు తీర్చుకోవడం కోసం క్యూలైన్లో బారులు తీరారు. శీఘ్రదర్శనానికి  3గంటలు, సర్వదర్శనానికి  సుమారు నాలుగుగంటలపాటు సమయం పట్టిందని కొందరు భక్తులు వివరించారు. సుధూ ర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసామని ఆలయ ఏఈవో ఉమారాణి తెలిపారు. ఆలయం ఎదుట భాగంలోని కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించుకుని తామెత్తు బెల్లాన్ని జోకించి పంచిపెట్టారు.  కోడెమొక్కులు, గండదీపం మొక్కులు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, పల్లకీ సేవలు, పెద్దసేవలు   నిర్వహించుకున్నారు.  ఆలయ ప రిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. అదేవిధంగా రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీభీమేశ్వరాల యం, బద్దిపోశమ్మ, నగరేశ్వరాలయాలవ ద్ద కూడా భక్తుల సందడి నెలకొంది. వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సు మారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ ప ర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,కాంచనపెల్లి నటరాజ్‌, పట్టణంలో భక్తుల రద్దీ దృష్ట్యా అవాంచనీయ సంఘటలను జరగకుండా వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో పట్టణ సీఐ శ్రీధర్‌ గట్టిపోలీస్‌ బందోబస్తును నిర్వహించారు.


logo