బుధవారం 03 జూన్ 2020
Rajanna-siricilla - Jan 28, 2020 , 02:48:10

వైభవంగా మార్కండేయ జయంతి

వైభవంగా మార్కండేయ జయంతి

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శివభక్త మార్కండేయ ఆలయంలో సోమవారం మార్కండేయ స్వామివారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో కనులపండువలా వేడుకలు చేపట్టారు. ఉదయాన్నే మహిళలు, పద్మశాలీ సం ఘం సభ్యులు ఊరేగింపుగా మానేరు వాగులోంచి జలాలను తీసుకువచ్చి మార్కండేయ ఆలయంలో స్వామివారికి జలాభిషేకం చేశారు. 21జంటలతో మార్కండేయ హోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళలో పద్మశాలీయులు మార్కండేయ శోభాయాత్రను కనుల పండువలా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ గా సంఖ్యలో హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యు లు భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు మోర శ్రీహరి, సర్పంచ్‌ అంకారపు అనిత, పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు బైరి రమేశ్‌, మచ్చ ఆంజనేయులు, సామల రమేశ్‌, మచ్చ రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ అంకారపు రవీందర్‌, మోర రాజు, మచ్చ శ్రీనివాస్‌, అశోక్‌, గణేశ్‌, చంద్రకాంత్‌, జగన్‌, మచ్చ మాధవ్‌, పద్మశాలీ సంఘం సభ్యులు, యువజన సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఎంపీపీ పడిగెల మానస, సర్పంచ్‌ అంకారపు అనిత, ఉప సర్పంచ్‌ పెద్దూరి తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, మోర నిర్మల, వార్డు సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

గంభీరావుపేట: మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళహారతులతో మార్కండేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమం లో మార్కండేయ సమితి సభ్యులు, పద్మశాలీలు పాల్గొన్నారు.  

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు బొప్పాపూర్‌లో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించా రు. మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో వేదపండితులు గొంగళ్ల ఉమాశంకరశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ పురవీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. బొప్పాపూర్‌ మార్కండేయ ఆలయంలో మహిళలు మొక్కులు చెలించుకున్నారు. ఇందులో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వనం బొందయ్య, ఉపాధ్యక్షులు గాజుల దేవదాసు, గోశిక దేవదాస్‌, కార్యదర్శి రాపెల్లి దేవాంతం, కార్యనిర్వహణ ఇన్‌చార్జి వనం రమేశ్‌, బొప్పాపూర్‌లో అర్చకులు దేవేందర్‌, లగిశెట్టి మనోహర్‌, రామ దామోదర్‌, గాలిపెల్లి మల్లేశం, తడుక దేవదాస్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు.


logo