శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Jan 25, 2020 , 02:46:36

రాములోరి దీవెనలతో అభివృద్ధి

రాములోరి దీవెనలతో అభివృద్ధి
  • ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కృషి
  • సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షం
  • ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు


కోనరావుపేట: రాములోరి దీవెనలతో ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలి పారు. మండలంలోని వేములవాడ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆల యం, నాగారంలోని కొదండ రా మస్వామి ఆలయ్నా జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణతో క లిసి ఆయన శుక్రవారం సంద ర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రమేశ్ బాబు మాట్లాడారు. మహిమన్వి తమైన మామిడిపల్లి సీతారామవస్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 40లక్షల నిధులు మంజూరయ్యా యని తెలిపారు. ఈ ఏడాదిలో ఆలయానికి ఘాట్ రోడ్డు, పర్ణశాల నిర్మిస్తానని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అలాగే నాగారం గుట్టపై కొలువుదీరిన కొదండ రామస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానని, గుట్టపై శివుని విగ్రహం ఏర్పాటు చేస్తామ ని వెల్లడించారు. ఇప్పటికే మండపం, ఆలయ గో పుర నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో రూ.36లక్షలతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థం  రూ.50లక్షలు  గుట్ట పై కోనేరు నిర్మాణానికి కృషిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యం గా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మై హోమం అధినేత రామేశ్వరరావు రూ.1కోటి విరాళం అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఆలయాభివృద్ధి పనులు ప్రారంభమరుగుతాయని ఉద్ఘాటించారు. ఆలయం వేములవాడ అనుబంధ దేవాయలయమ వుతుందని, అందుకోసం సీఎం కేసీఆర్‌కు నివేదికలు పంపామని తెలిపారు.

కేసీఆర్‌తో రాష్ట్రం సుభిక్షం...

అనంతరం కనగర్తి గ్రామ శివారులో కా ళేశ్వరం ప్యాకేజీ9లో భాగంగా నిర్మిస్తున్న కు డికాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని కొని యాడారు. పేదల సంక్షేమం కోసమే రూ.36 వేల కోట్లు వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మల్కపేట రిజర్వాయర్ పనులు సాగుతున్నాయని, తద్వారా కాలువల ద్వా రా ప్రతి చెరువూ నిండే అవకాశముందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం సస్యశామ లం కానుందని వివరించారు. అదేవిధంగా సుద్దాల గ్రామం నుంచి మర్తనపేట వరకు  రోడ్డు పనులు పూర్తవుతాయన్నారు. వేములవాడ బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా ఎ గురబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీ ఆర్‌ఎస్ పార్టీకే ప్రజల అశీర్వదాలు ఉన్నాయ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీలు మరోసారి చి త్తుగా ఓడడం ఖాయమని వివరించారు.

 భూమి పూజ..

మామిడిపల్లి ఆలయం ఆవరణలో సీతారామ క్షేత్ర నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించా రు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇలాంటి స త్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సె స్ డైరక్టర్ తిరుపతి, వైస్‌ఎంపీపీ వంగపల్లి సు మలత, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మంతెన సంతోష్, సర్పంచ్‌లు లావణ్య, కొక్కుల భా రత, ఎంపీటీసీలు మిర్యాల ప్రభాకర్‌రావు, మల్లేశ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్స య్య, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్‌గౌడ్, ఫర్టిలైజర్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు మ ర్యాల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.


logo