గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jan 25, 2020 , 02:43:34

భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి

భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
  • టెస్కాబ్ చైర్మన్ కొండూరి
  • లబ్ధిదారులకు చెక్కులు అందజేత

గంభీరావుపేట: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభు త్వం రాయితీ రుణాలను అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి పొంది భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు సూచించారు. మండలంలోని 24 మంది మైనార్టీలకు 80శాతం రాయితీపై రూ.లక్ష చొ ప్పున ప్రభుత్వం రుణాలను మంజూరు చేసింది. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు చెక్కులను అందజేసి అనంతరం రవీందర్‌రావు మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందిస్తున్నారని కొనియాడారు. మైనార్టీల సం క్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. యువత రుణాలను పొంది భవిష్యత్తుకు బంగారు బా టలు వేసుకోవాలని రవీందర్‌రావు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సర్వర్‌మియా, ఏఎంసీ చైర్మన్ లిం గన్నగారి దయాకర్‌రావు, సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, మండల కో ఆప్షన్ సభ్యుడు జంషీద్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు దోసల లత, ఎంపీడీవో శ్రీనివాస్, తాసీల్దారు సుమచౌదరి,  టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, మండల నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, కు తుబోద్దిన్, వహీద్, నారాయణరావు, మైనార్టీ లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.


logo