మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Jan 24, 2020 , 04:51:38

కౌంటింగ్‌కు రెడీ

కౌంటింగ్‌కు రెడీ
  • - సిరిసిల్లలో 35 టేబుళ్లు.. వేములవాడలో 27 టేబుళ్లు..
  • - సిబ్బంది నియామకం పూర్తి.. ఏజెంట్లకు నేడు శిక్షణ
  • - స్ట్రాంగ్‌ రూంల్లో బ్యాలెట్‌ బాక్సులు
  • - పరిశీలించిన మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో అధికారులు కౌంటింగ్‌కు రెడీ అయ్యారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు కానుండగా, ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సిరిసిల్లలో 35 వార్డులకు 35 టేబుళ్లు, వేములవాడలో 27 వార్డులకు టేబుళ్లు ఏర్పాట్లు చేసి, సిబ్బందిని కూడా కేటాయించారు. ఇటు సిరిసిల్లలోని సినారె కళామందిరంలో భద్రపరిచిన బాక్సులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే, కమిషనర్‌ సమ్మయ్య, వేములవాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్కింపు కేంద్రాన్ని కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గురువారం పరిశీలించారు.
- రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ వేములవాడ నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల టౌన్‌

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ వేములవాడ, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీలలో మొత్తం 67 వార్డులుండగా, ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 62 వార్డులకు గత బుధవారం ఎన్నికలు జరిగాయి. 25న (శనివారం) ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. సిరిసిల్ల మున్సిపాల్టీలో 35 వార్డుల్లో 148మంది అభ్యర్థులు, వేములవాడ మున్సిపాల్టీలోని 27వార్డుల్లో 126మంది అభ్యర్థులు పోటీ చేశారు. గెలుపు తమదేనంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఉత్కంఠతో ఓట్ల లెక్కింపు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి

ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సిరిసిల్లలో ఓట్లను లెక్కించేందుకు సినారె కళామందిరంలో మొత్తం 35 టేబు ళ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇందు కోసం 105మంది సిబ్బందిని నియమించారు. అలాగే వేములవాడకు సంబంధించి వేములవాడలోని జూనియర్‌ కళాశాలలో 10రూంలలో 27టేబుళ్ల ద్వారా ఓట్ల ను లెక్కించనున్నారు. ఉదయం 8గంటలకు నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోగా కౌంటిం గ్‌ను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీ బందోబస్తు నిర్వహించేలా ఎస్పీ రాహుల్‌హెడ్గే చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ పరిశీలించారు. బ్యాలెట్‌ బాక్సులకు పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీకేండ్లు ఏర్పాటు చేశారు. ఏజెంట్లకు ప్రత్యేక పాసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఒకేసారి మొత్తం వార్డుల లెక్కింపు
వేములవాడ పురపాలక సంఘంలో జరిగిన ఓట్లను శనివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారులు లెక్కించనున్నారు. వేములవాడలో 27వార్డుల్లో ఎన్నిక జరుగగా, మొత్తం వార్డులను ఒకేసారి లెక్కించేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. ఇందుకు అనుగుణంగా మొత్తం 27 టేబుళ్లను సిద్ధం చేస్తుండగా, ప్రతి రిటర్నింగ్‌ అధికారి పరిధిలోకి మూడు వార్డులను కేటాయించనున్నారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి పరిధిలోని 3వార్డులకు ఒకేసారి లెక్కింపు విధానాన్ని చేపట్టనున్నారు. కేంద్రంలో మూడు టేబుళ్లను ఏర్పాటుచేసి, వార్డు వారీగా ఒకేసారి లెక్కించేందుకు లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఉదయయే వెలువడనున్న ఫలితాలు

పురపాలక సంఘం పరిధిలోని మొత్తం వార్డులను ఒకేసారి లెక్కించడం ద్వారా ఫలితాలు కూడా త్వరగానే వెలువడనున్నట్లు తెలుస్తుంది. ఒక్కో రిటర్నింగ్‌ అధికారి పరిధిలో మూడు వార్డులను కేటాయించడమే కాకుండా అన్ని వార్డులను అధికారులు ఒకేసారి లెక్కించనున్నారు. దీంతో మొదట వార్డుల వారీగా రెండు పోలింగ్‌ బూత్‌లలో వచ్చిన ఓట్లను ప్రతి 25ఓట్లకు ఒక కట్టను ఏర్పాటు చేయనున్నారు. కట్టలు పూర్తయిన తర్వా త రెండు పోలింగ్‌ బూత్‌ల్లోని ఓట్లను కలిపి, అభ్యర్థుల వారీగా విడదీయనున్నారు. అనంతరం మళ్లీ అభ్యర్థుల వారీగా వంద ఓట్లకు ఒక కట్టను కట్టి తదుపరి లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకే ఈ లెక్కింపు ప్రారంభం కాగా, దాదాపుగా 9 గంటలకే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది.

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

పురపాలక సంఘం పరిధిలోని 62వార్డుల్లో 274మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలిం గ్‌ పూర్తవ్వడమే కాకుండా అభ్యర్థుల భవితవ్యం, బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమై ఉండగా ఫలితంపై తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే ఫలితాలపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. పురపాలక సంఘం పరిధిలోని వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపుపై కూడా జోరుగా చర్చ జరగుతుంది. శనివారం ఉదయంలోగా ఫలితాలు వెలువడనుండగా, 24 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.

కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ను సజావుగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సినారె కళా మందిరంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేం ద్రాన్ని గురువారం ఆయన సందర్శించి, మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను శనివారం స్థానిక సినారె కళామందిరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులను సినారె కళా మందిరంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచినట్లు చెప్పారు. 39వార్డులకు నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా, 35వార్డులకు ఎన్నికలు నిర్వహించామని తెలిపా రు. 35వార్డుల్లో 148మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం వార్డు కో టేబుల్‌ చొప్పున 35టేబుళ్లు ఏర్పాటు చేయ గా, 105మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. ప్రతి వార్డుకు సంబంధించిన రెండు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారని తెలిపారు.logo