ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 24, 2020 , 03:57:15

జాతరో.. జాతర..

జాతరో.. జాతర..
 • - సిరిసిల్లలో గంగమ్మ.. మాండవ్య తీరాన మల్లారెడ్డిపేట జాతర
 • - ముస్తాబాద్‌లో సీతారామచంద్రుల క్షేత్రం
 • - కల్యాణోత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
 • - మాఘ అమావాస్యకు పూర్తయిన ఏర్పాట్లు
 • -ముచ్చటగా మూడోసారి వేడుకలు
 • - గంగుల నేతృత్వంలో ఏర్పాట్లు
 • - మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైభవోపేతంగా నిర్వహణ
 • - పది రోజులపాటు కార్యక్రమాలు
 • - తిరుమల నుంచి పదివేల లడ్డూలు
 • -భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ, కొండగట్టు నుంచి పూజారులు
 • - కేరళ నుంచి ప్రత్యేక వాయిద్య బృందాలు
 • - 31న అంగరంగ వైభవంగా కల్యాణం
 • - ఫిబ్రవరి 3న భారీ శోభాయాత్ర
 • - హాజరు కానున్న చినజీయర్‌ స్వామి, డాలర్‌ శేషాద్రి, తాళ్లపాక హరినారాయణా చార్యులు
 • - కరీంనగరానికి కొత్త

సిరిసిల్ల కల్చరల్‌:  కార్మికక్షేత్రం సిరిసిల్ల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాఘ అమావాస్య రోజున నేడు నిర్వహించే గంగాభవాని, మడేలేశ్వర స్వామి, రామలింగేశ్వరుల కల్యాణోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జాతరలకు నిర్వాహకులు, అధికా రులు  అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రాముఖ్యత..

అమావాస్య ప్రారంభం నుంచి ఈ మాసం కావడం తో జిల్లాలోని పలు ఆలయాల్లో ఆయా దేవతల కల్యాణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క సిరిసిల్లలోనే ఏటా గంగపుత్రులు అమ్మవారి వివాహ వేడుకలు జరిపించడం తరాల నుంచి వస్తుందని గంగపుత్రుల సంఘ సభ్యులు చెబుతున్నారు. మానేరు నదీ ఒడ్డున రజక సంఘం ఆధ్వర్యంలో 28 సంవత్సరాల క్రితం మడేలేశ్వరుని ఆలయం నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం శివపార్వతుల కల్యా ణం నిర్వహిస్తున్నారు. ఇక్కడే గంగాభవాని ఆలయా న్ని మానేరు నది మధ్యలో 1963లో నిర్మించినట్లు స భ్యులు చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం భక్తులు జాతరకు, అమ్మవారి దర్శనానికి లక్షకు పైగా వస్తారని వారు తెలిపారు. ఉదయం 4గంటల నుంచి జాతర మొదలవుతుంది. పట్టణ పలు ప్రాంతాల వారు గ్రామాల వా రు భారీగా పాల్గొంటారు. పట్టణ శివారు గుట్టల్లో ఉన్న రామప్ప గుడిలో రామలింగేశ్వరస్వామి కల్యాణ వేడుకలు నాయీబ్రాహ్మణ సంఘం చేపడుతుంది.

ఆలయాలు ముస్తాబు...

జిల్లాలో జాతర మహోత్సవం జరుగుతున్నందున గంగాభవాని, మడేలేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు తిరునాళ్లకు ముస్తాబవుతున్నాయి. ఒకేరోజు మూడు చోట్ల జాతరలు జరుగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాండవ్య తీరాన మల్లారెడ్డిపేట జాతర

గంభీరావుపేట: మండలంలోని మాండవ్య నదీ తీరాన గల మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి ఆల యం వద్ద జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది మాఘమాస పర్వదినం రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఇతర మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటారని వారు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ సభ్యులు తెలిపారు.

ముస్తాబాద్‌లోని ఆలయాల్లో..

ముస్తాబాద్‌:  మండలంలోని పోతుగల్‌, రామలక్ష్మణులపల్లె,  చీకోడు, కొండాపూర్‌ గ్రామాల్లో వెలసిన ఆలయాల్లో శుక్రవారం జరిగే జాతర ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోతుగల్‌లో అతి పురాతన శివకేశవ ఆలయాల్లో జాతరను వై భవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమావాస్య రోజున వాగు ల్లో స్నానాలు చేసి ఆలయాల్లో దీపాలు వెలిగించి, పూజలు నిర్వహిస్తారు.  ఆలయాల పరిసరాలు దుకాణల ఏర్పాటుతోపాటు భక్తులలో కిటకిటలాడుతాయి.

నేడు ఎమ్మెల్యే రాక

కోనరావుపేట: నేడు మండలంలోని మామిడిపల్లి, నాగారం గ్రామాలలో జరిగే మాఘ అమావాస్య జాతరకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ వస్తున్నట్లు మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలిరవాలని కోరారు. మండలంలోని మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ పరిశీలించారు. అన్ని రకాల వసతులను కల్పించినట్లు, భక్తులు పెద్దఎత్తున తరలిరవాలని ఆయన కోరారు.