ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jan 23, 2020 , 03:50:41

ఓటెత్తిన పట్టణం

 ఓటెత్తిన పట్టణం
  • - రెండు మున్సిపాలిటీల్లో 81.50 శాతం పోలింగ్
  • - ముగిసిన ‘పుర’ ఎన్నికలు
  • - కదిలిన పట్టణవాసులు
  • - ఉదయం నుంచే కేంద్రాలకు బారులు
  • - ఉత్సాహం చూపిన ఓటర్లు
  • - ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
  • - మొత్తంగా ఓటు వేసింది 82,961 మంది..

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/వేములవాడ,     నమస్తేతెలంగాణ : పురపోరు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీలలో 67 వార్డులున్నాయి. ఏకగ్రీవమైన 5 వార్డులు పోను మిగిలిన 62 వార్డులకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాలకు ఉదయం నుంచే చేరుకున్నారు. మొత్తం 1,01,777 మంది ఓటర్లకు గాను 82,961 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 81.50 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో 39,605 మంది పురుషులు, 43,356 మంది మహిళలు ఓటు హ క్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. సిరిసిల్ల మున్సిపాల్టీలో మొత్తం 39 వార్డులు ఉండగా, ఇందులో నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 35 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వేములవాడ ము న్సిపాల్టీలో 28 వార్డులుండగా ఒక వార్డు ఏకగ్రీవం పోను మిగిలిన 27 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. సిరిసిల్లలో మొత్తం 67,160 ఓటర్లకు గాను 54,929 మంది, వేములవాడలో 34,615 మంది ఓటర్లకు గాను 28,032 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు

మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా ఉన్నతాధికారులు తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేం ద్రంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్పీ రాహుల్ నెహ్రూనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రత్యేక అధికారి రాహుల్ డీఆర్వో ఖిమ్యానాయక్, గీతానగర్ మండల పరిషత్ పాఠశాలలో ఆర్డీఓ శ్రీనివాసరావు, తాసిల్దార్ అంజన్న ఓటు వేశారు. కాగా టీఆర్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సెస్ వైస్ లగిశెట్టి శ్రీనివాస్ సతీసమేతంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

ఓటేసిన శతాధిక వృద్ధులు

సిరిసిల్ల, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల పోరులో  శతాధిక వృద్ధులు త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాకేంద్రంలోని నాలుగో వార్డులో షేక్ మలాన్ (102) తన ఓటు హక్కును స్థానిక జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో వినియోగించుకున్నారు. సిరిసిల్ల మన్సిపాలిటీలలో విలీన గ్రామమైన చి న్నబోనాలలోని 10 వార్డులో కాశెట్టి రాజవ్వ (101) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు.

స్ట్రాంగ్ తరలింపు

బుధవారం సాయంత్రం వరకు ఎన్నికలు జరిగిన అనంతరం బ్యాలెట్ బాక్సు లను అధికారులు సురక్షితంగా, బందోబస్తు మధ్య తరలించారు. సిరిసిల్లలోని సినారె కళామందిరంలో, వేములవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. సిరిసిల్ల లోని బాక్సులను కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. కాగా ము న్సిపల్ ఎన్నికల లెక్కింపు ఈ నెల 25న కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారం, పో లింగ్ ముగిసేవరకు తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేత లు ఎన్నికలు ముగిసిన అనంత రం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.logo