గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 22, 2020 , 04:25:03

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి


వేములవాడ నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. సిరిసిల్ల, వేములవా డ పరిధిలో ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన మంగ ళవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మాట్లాడు తూ.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందు కు కృషి చేయాలని సూచించారు. పోలింగ్ కేం ద్రాల్లో భద్రత చర్యలపై క్లుప్తంగా అవగాహన క ల్పించారు. ఎన్నికల నియామవళిని పూర్తి స్థాయి లో అమలు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏమరుపాటు తగదని, బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది కలిగించే, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించే అల్లరి మూకల పట్ల కఠినంగా వ్యవహరించాలని  ఆదేశించారు.

ప్రశాంత వాతావరణం కల్పించాలి

పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ రాహుల్ కోరారు. రాష్ట్ర ఎన్నికల సం ఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూ చించారు. సమర్థవంతంగా విధులను నిర్వహించి జిల్లా పోలీసులపై మరింత విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించుకుందామని పిలుపునిచ్చారు. అం దుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో అభ్యర్థులు ప్రచారం చేసే వి ధంగా సూచనలివ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికలకు సహకరించాలన్నారు. తొలుత వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో చేసిన ఎన్నికల ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ పరిశీలించారు.  ఆయా సమావేశాల్లో సిరిసిల్ల, వే ములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సీఐలు శ్రీధర్, నవీన్ వెంకటేశ్వర్లు, ఎస్ ఏఎస్ తదతరులు పాల్గొన్నారు.