శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jan 22, 2020 , 04:23:53

విలీనగ్రామాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

విలీనగ్రామాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిసిరిసిల్ల రూరల్: సిరిసిల్ల మున్సిపాలిటీ విలీనమైన గ్రామాల్లో బల్దియా ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విలీన గ్రామాలైన సిరిసిల్ల మండల పెద్దూరు, ఇప్పలపల్లి, జగ్గరావుపల్లె, పెద్దబోనాల, చిన్నబోనాల, రాజీవ్ ముష్టిపల్లి, చంద్రంపేట, జ్యోతినగర్, రగుడుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చే శారు. వాటిపరిధిలో 1, 8, 9, 10, 11, 12, 24, 22 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది, తమ సామగ్రితో బూత్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల్లో పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేం ద్రాలకు 100 మీటర్ల దూరం వరకూ 144సెక్షన్ అమలులో ఉండనుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ప త్రాల ద్వారా పోలింగ్ జరగనుండడం తెలిసిందే.