బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 21, 2020 , 01:37:36

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి


సిరిసిల్ల రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చా రు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాలలో మున్సిపల్‌ ఎన్నికల ప్ర చారంలో భాగంగా 10వ వార్డు అభ్యర్థి దడిగెల శ్రావణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావు, బస్వారాజు సారయ్య, తోట ఆగయ్యతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మా ట్లాడారు. దుబాయ్‌, ఇతర రాష్ర్టాలకు వెళ్లిన సిరిసిల్ల వాళ్లు తిరిగి సిరిసిల్లకు వస్తే గుర్తుపట్టలేనట్లుగా అభివృద్ధి జరిగిందన్నారు. తంగళ్లపల్లి మానేరు వంతెన బ్రిడ్జికి కింద మనిషి మునిగేలోతంత నీళ్లు, గోదావరి జలాలు ఎదురురావడం, ఇవన్నీ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిరిసిల్ల మెట్ట ప్రాంతం ఎస్‌ఆర్‌ఆర్‌, మల్కపేట రిజర్వాయర్‌లతో సస్యశ్యామలం అవుతుందన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల రూపురేఖలు మారాయన్నారు. విలీన గ్రామాల్లోని వ్యవసాయ భూములకు భారీగా డి మాండ్‌ వస్తుందన్నారు.

ఆ గ్రామాలను కలుపుకోని కరీంనగర్‌ -సిరిసిల్ల-కామారెడ్డి వరకు జాతీయ రహదారి మంజూరైందన్నారు. అన్ని రకాలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. 10వ వార్డు అభ్యర్థి శ్రావణ్‌రావు నాయకుడిగా నిరూపించుకున్నాడని, మంత్రి కేటీఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్నారన్నా రు. శ్రావణరావు తల్లి కమలాబాయి ఎంపీపీగా చిన్నబోనాల గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. కౌన్సిలర్‌గా శ్రా వణ్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలన్నా రు. అంతకుముందు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకొని, మంత్రి కేటీఆర్‌కు కానుకగా అందిద్దామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ దడిగెల కమలబాయి, కిషన్‌ రావు, చల్ల హరికృష్ణ, జక్కుల నాగరాజు, సత్యనారాయణ రెడ్డి, బండారి శ్యాం, రాములు, తుమ్మల నర్స య్య, చల్ల అంజయ్య, సుంకరి బాలకిషన్‌, శ్రీనివాస్‌, నిమ్మల రాజు, మల్లేశం, పడిగె రాజ య్య, చెరపల్లి పర్శరాములు, డిష్‌ మ ల్లేశం, భనావత్‌ సీత, తుమ్మల వసంత, బల్యాల చిన్నమ్మి, తుమ్మ ల లావణ్య, బాలకిషన్‌, ఎల్లయ్యతోపాటు మహిళలు, సంఘాల వారు తదితరులు ఉన్నారు.


కారుకు ఓటేస్తే కేటీఆర్‌కు వేసినట్లే ..

సిరిసిల్ల టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటును కారు గుర్తుపై వేస్తే అభివృద్ధి ప్రదాత కేటీఆర్‌కు వేసినట్లేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో స్థానిక అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించడంలో కేటీఆర్‌ రాష్ట్రంలోనే ప్ర థమ స్థానంలో నిలిచారన్నారు. సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పని చేసిన మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల విజయాన్ని కానుకగా అందించి ఆయన రుణం తీర్చుకుందామని ఆకాంక్షించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఉమ్మడిజిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగారావు, చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సెస్‌ డైరెక్టర్లు ఏనుగు విజయరామారావు, కుంబాల మల్లారెడ్డి, వెన్నమనేని శ్రీనివాసరావు, గుండారపు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సర్దాపూర్‌, జగ్గరావుపల్లెలో కొండూరి ప్రచారం

సిరిసిల్ల రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు కోరారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్‌, జగ్గరావు పల్లెలో 9వ వార్డు అభ్యర్థి లింగంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధికి మంత్రి సరైన ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయన వెంట సెస్‌ ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ వొజ్జల అగ్గిరాములు, కమ్మరి రాజరాం, షేక్‌ అలీతో పాటు పార్3టీ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు.