శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jan 21, 2020 , 01:36:09

శ్రావణ్‌రావును గెలిపించండి

శ్రావణ్‌రావును గెలిపించండి


సిరిసిల్ల రూరల్‌: మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులతో 10వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన దడిగెల శ్రావణ్‌రావును గెలిపించాలని రాష్ట్ర ప్ర ణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు అరుణ పిలుపుని చ్చారు. టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు. వి లీన గ్రామాలైన చిన్నబోనాల, భూపతినగర్‌, ము ష్టిపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వ హించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, మహిళలు, యు వకులతో భారీర్యాలీని నిర్వహించగా,  వినోద్‌కు మార్‌ పాల్గొని మాట్లాడారు. ఎంపీపీగా దడిగెల కమలభాయి  ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఇప్పుడు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె తనయుడు శ్రావణ్‌రావును ఆదరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు పాటుపడతానని వివరించారు. మంత్రి కేటీఆర్‌ సంపూర్ణ సహకారముందని, 10వ వార్డును ఆదర్శంగా నిలుపుతామని, భారీ మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నబోనాలలో శ్రావణ్‌రావుకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ జడ్పీ అధ్యక్షురాలు అరుణ ఓట్లను అభ్యర్థించా రు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చిక్కాల రామారావు, తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ దడిగెల కమలభాయి, కిషన్‌రావు, చల్ల హరికృష్ణ, బండారి శ్యాం, రాములు, తుమ్మల న ర్సయ్య, చల్ల అంజయ్య, సుంకరి బాలకిషన్‌, శ్రీ నివాస్‌, నిమ్మల రాజు, మల్లేశం, పడిగె రాజ య్య, చెరపల్లి పర్శరాములు, డిష్‌ మల్లేశం, భనావత్‌సీత, తుమ్మల వసంత, బల్యాల చిన్నమ్మి, తుమ్మల లావణ్య, బాలకిషన్‌, ఎల్లయ్యతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.