గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jan 20, 2020 , 04:25:08

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం
  • - 60 ఏళ్లలో జరగని అభివృద్ధి గత ఐదేళ్లలో చేసి చూపాం
  • - 220 కోట్లతో డెవలప్‌మెంట్‌ పనులు
  • - 108 కోట్లతో నాంపల్లి గుట్ట అభివృద్ధికి ప్రతిపాదనలు
  • - 23 కోట్లతో విలీన గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తాం..
  • -వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు
  • - వాడవాడనా విస్తృత ప్రచారం

వేములవాడ, నమస్తే తెలంగాణ:  అభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే రమేశ్‌బాబు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆయన వేములవాడలోని పలు వార్డుల్లో కలియతిరిగారు. వేములవాడలో 220కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగడమే కాకుండా దాదాపు పూర్తి కావస్తున్నాయన్నారు. రాజన్న క్షేత్రంతో పాటు నాంపల్లి గుట్టను కూడా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే 108 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమై ప్రభుత్వం వద్దకు చేరాయన్నారు. విలీన గ్రామాల్లోనూ సీసీ రహదారులు, మురుగు కాలువ నిర్మాణానికి 23 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తయి పనులను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. 22కోట్లతో నిర్మా ణం పూర్తి చేసుకుంటున్న వంద పడకల దవాఖాన అత్యున్నత న్యాయమైన ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను అందించేందుకు ఇప్పటికే పనులకు శంకుస్థాపన చేశామని గుర్తించారు. మొదటి దశలో 800 నిరుపేదలకు అందిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి కౌన్సిలర్‌ అభ్యర్థులు 27మందిని గెలిపించి వేములవాడ పురపాలక సంఘంపై గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. ఇక పురపాలక సంఘంలోని 5వ వార్డు అభ్యర్థి జడల లక్ష్మీ శ్రీనివాస్‌, 10వ వార్డులో అభ్యర్థి పర్శరాములు, 12వ వార్డులో తీగల శైలజ వెంకటేశ్వర్‌రావు, 15వ వార్డులో పుల్కం శ్రీలక్ష్మీ రాజు, 16వ వార్డులో కొండ శ్రీలత, 19, 20వ వార్డులో ఎదుల తిరుపతి, 21వ వార్డులో నరాలశేఖర్‌కు మద్దతుగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు వార్డులో కుమ్మరి శిరీష శ్రీనివాస్‌, హాజరవడమే కాకుండా మద్దతు తెలిపారు. ఇక 3వ వార్డులో అభ్యర్థి నిమ్మశెట్టి విజయ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు,  ఏనుగు మనోహర్‌రెడ్డి, 14వ వార్డులో అభ్యర్థి బింగి మహేశ్‌కు మద్దతుగా మున్నూరుకాపు పటేల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవ య్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.logo