గురువారం 16 జూలై 2020
Rajanna-siricilla - Jan 20, 2020 , 04:17:13

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

 పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
  • - ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
  • - ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు వేయించాలి
  • - కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ n పల్స్‌పోలియో ప్రారంభం
  • - 20, 21 తేదీల్లో ఇంటింటా చుక్కల పంపిణీ


సిరిసిల్ల టౌన్‌: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఐదేళ్ల లోపు 48,686మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపా రు. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం ట్రాన్సిట్‌ కేంద్రాల ద్వారా బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కలు వేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ మురళీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, ఆనంద్‌భాస్కర్‌ పాల్గొన్నారు.logo