బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jan 19, 2020 , 02:04:45

రామన్నకు నీరాజనం

రామన్నకు నీరాజనం


సిరిసిల్ల / వేములవాడ, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ శనివారం సిరిసిల్ల, వేములవాడలో రోడ్‌ షో నిర్వహించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, నాయకులు ఘన స్వా గతం పలికారు. తిప్పాపూర్‌ నుంచి రాజన్న ఆలయం మీ దుగా తెలంగాణ చౌక్‌, కోరుట్ల బస్టాండ్‌ వరకు రామన్న రోడ్‌షో నిర్వహించారు. తర్వాత సిరిసిల్ల సమీపంలోని రగుడు నుంచి నేతన్న చౌక్‌ చేరుకున్నారు. అక్కడ నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, అంబేద్కర్‌ చౌక్‌కు చేరుకొని ప్రసంగించారు. అనంతరం గాంధీ చౌక్‌ వరకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయాచోట్ల వేలాది మంది ప్రజలు నీరాజనం పట్టారు. దారికిరువైపులా నిల్చుని, గులాబీ జెండాలు, మంగళహారతులు, బోనాలు, బతుకమ్మలతో స్వాగతించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వగా, జేజేలు పలికారు.

‘జై కేటీఆర్‌' ‘జై జై కేటీఆర్‌' ని నాదాలతో హోరెత్తించా రు. రోడ్లకిరువైపులా నిల్చుని జేజే లు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాలతో క ళాకారులు బ్ర హ్మరథం పట్టారు. ఈ రోడ్‌షోలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, పార్టీ ఉమ్మ డి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బస్వరాజ్‌ సా ర య్య, సీనియర్‌ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, బైరగోని లావణ్య, గంగం స్వ రూపారాణి, చంద్రయ్యగౌడ్‌, జడ్పీటీసీలు మ్యా కల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్‌, దేవరకొండ తిరుపతి, బరిలో ఉన్న అభ్యర్థులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

తరలిన విలీనగ్రామాలు

సిరిసిల్ల రూరల్‌: రగడులో మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికా యి. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద 1వ వార్డు అభ్యర్థి చవేణి సత్య-ఎల్లయ్యయాదవ్‌ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. మహిళలకు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. అనంత రం సిరిసిల్ల రోడ్‌షోకు తరలివెళ్లారు. వారిలో పా ర్టీ అభ్యర్థులు దడిగెల శ్రావణ్‌రావు, బుర్ర లక్ష్మి, ఉమ, రాజిరెడ్డి, పోచవేణి సత్య, సత్యనారాయ ణ, ఎరవెల్లి వసుంధర తదితరులున్నారు.logo