గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jan 18, 2020 , 03:55:08

నేడు కేటీఆర్‌ రోడ్‌షో

 నేడు కేటీఆర్‌ రోడ్‌షో


రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ము న్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ నేడు రోడ్‌షో నిర్వహించ నున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ వెల్లడించారు. సిరి స్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శనివారం 20 వేల మందితో నిర్వహించనున్న రోడ్‌షోలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపా రు. వేములవాడ పట్టణంలో మధ్యాహ్నం ఒంటి గంటకు తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి కోరుట్ల బ స్టాండ్‌ వరకు రోడ్‌షో ఉంటుందని వివరించారు. తర్వాత సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్‌నుంచి పద్మనాయక కల్యాణ మండపం వరకు రోడ్‌షో ఉంటుందని తెలిపారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో మధ్యాహ్నం 3గంటలకు ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. కేటీఆర్‌ రోడ్‌షోను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దే శంలో ఎక్కడా లేని విధంగా, ఏప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

సమైఖ్య పాలకుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయి న వస్త్ర పరిశ్రమకు అండగా నిలిచారని వివరించా రు. కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని క్రి స్మస్‌, రంజాన్‌, బతుకమ్మ చీరెల ఆర్డర్లను కల్పిం చి తద్వారా నేతన్న కార్మికులకు చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం వచ్చేలా చేశారని, వారి బతుకులకు భరోసా కల్పించారని కొనియాడారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, దివ్యాంగులకు నెలకు రూ. 2016లు పింఛన్లను అందిస్తు న్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు. కల్యాణలక్ష, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘన త తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని వివరించారు. పేదల కోసం తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు సైతం ఆదర్శంగా తీసుకోవడం మనకు గర్వకారణమని వివరించారు.

రాష్ర్టానికే ఆదర్శంగా సిరిసిల్ల

ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీటికి అనేక ఇబ్బందులపడడమే గాక, అభివృద్ధిలో వెనక బడ్డ మెట్ట ప్రాంతం సిరిసిల్ల నేడు జలసిరులతో కళకళలాడుతున్నదని వినోద్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మంత్రిగా కేటీఆర్‌ చేపట్టిన అభివృద్ధితో జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దారని వివరించారు. సిరిసిల్ల పట్టణంలో పార్కులు, మినీ ట్యాంక్‌ బండ్‌, సుందరీకరణ, వైకుంఠధా మాల నిర్మాణాలు చేపట్టారని గుర్తుచేశారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతాన్ని గోదావరి జలాలతో అభిషేకిస్తానని జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్‌ నెరవేర్చుతున్నారని శ్లాఘించారు. గోదావరి జలాలు మధ్యమానేరు ద్వారా సిరిసిల్లను తా కడం ఈ ప్రాంతం అదృష్టమని వివరించారు.

టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి

ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిల వాలని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణవాసులకు ఆయన విజ్ఞప్తి చేశా రు. మున్సిపాల్టీలో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిచినట్లయితే పట్టణాలు మరింత అభివృద్ధి చెం దుతాయన్నారు. సిరిసిల్లను పర్యాటక కేంద్రంగా కేటీఆర్‌ తీర్చిదిద్దుతారని చెప్పారు. సమావేశంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ మంత్రి బస్వరాజ్‌ సారయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చీటి నర్సింగారావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్‌, తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.


logo