ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jan 18, 2020 , 03:54:21

రేపటి నుంచి పల్స్‌పోలియో

రేపటి నుంచి పల్స్‌పోలియో


రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: చుక్కల మం దుతో చిన్నారులకు చక్కని జీవితం ప్రసాదించేందుకు సర్కారు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చే స్తున్నది. జిల్లాలో మొత్తం జనాభా 5,65,887 మంది ఉండగా, జీరో నుంచి5 ఏండ్లలోపు 48,686 మంది చిన్నారులున్నారు. వారందరికీ చుక్కల మందు వేయించే లా అధికార యంత్రాగం చర్యలు తీసుకుంటున్నది. అందుకు 398 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 39 మంది సూపర్‌వైజర్లతో 1,568 మంది సిబ్బందిని నియమించి శత శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని వైద్యఆరోగ్య శాఖ ముందుకెళ్తున్నది.

ఏర్పాట్లు చేసిన అధికారులు

పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా జిల్లాలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో గత సోమవారం ఏర్పా టు చేసిన టాస్క్‌పోర్స్‌ సమావేశంలో దిశానిర్దేశం చే సి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా లో జనాభా 5,65,887 మంది ఉండగా, అందు లో 0 నుంచి 5ఏళ్లలోపు చిన్నారులు 48,686 మం ది ఉన్నారు. వారందరికీ చుక్కల మందు వేయించే లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇల్లంతకుంట మండలం, గంభీరావుపేట మండలం నర్మాల తదితర గ్రామాల్లో 17 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, గోదాంలు, బస్టాండ్‌లు, సంచార జాతులకు చెందిన పిల్లలను గుర్తించారు. ఈ ప్రాం తాల్లోని చిన్నారులందరికీ చుక్కల మందు వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారుల సహకారంతో ముందుకు పోతున్నారు. పోలియో చుక్కలు వేయడానికి వైద్యాధికారులు పారామెడికల్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, సెల్ఫ్‌హె ల్ప్‌ గ్రూపుల మహిళలు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు. అం దుకోసం 1,568 మంది సిబ్బందిని నియమించారు. పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో మొ త్తం 398 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 362, అర్బన్‌లో 36 కేంద్రాలు ఉన్నాయి. బస్టాండ్‌లు, దవాఖానలు, నర్సింగ్‌హోంలు, కమ్యూనిటీ హాళ్లు, ప్లేస్కూళ్లు, పార్కులు, ఓపెన్‌ జిమ్‌ల వద్ద ఆడుకుంటున్న పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు సైతం అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ట్రాన్సిటీ టీంలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాం తాలకు 13, అర్బన్‌లో ఒకటి చొప్పున మొబైల్‌ టీం లు పనిచేయనుండగా, వాటిని పర్యవేక్షణకు 39 మంది సూపర్‌వైజర్లను నియమించారు.

మూడు రోజుల పాటు కార్యక్రమం

ఈనెల 19న వీలు కాని పిల్లలకు తర్వాత రెండు రోజుల పాటు చుక్కల మందు వేయనున్నారు. 19, 20, 21 తేదీలలో ఇంటింటికీ సర్వే చేసి మిగిలిన పిల్లలకు చుక్కల మందు వేస్తారు. ప్రత్యేక మొబైల్‌ టీంలు ఇంటికే వచ్చి వేస్తారు. పల్స్‌పోలియో కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు రిఫ్రిజిరేటర్లు, డీప్‌ ఫ్రీజర్లు, ఐఎల్‌ఆర్‌లు, కోల్డ్‌ బాక్స్‌లు, వాక్సిన్‌ క్యారియర్లు, థర్మో కూల్‌బాక్స్‌లు, ఐస్‌ప్యాక్‌లన్నీ ఇప్పటికే సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.logo