మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jan 18, 2020 , 03:49:16

మైనార్టీల సంక్షేమానికి కృషి

మైనార్టీల సంక్షేమానికి కృషి


వేములవాడ, నమస్తేతెలంగాణ: మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నద ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఉద్ఘాటించా రు. సుభాష్‌నగర్‌కు చెందిన పలువురు ముస్లిం యువకులు సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో శుక్రవా రం చేరారు. అదేవిధంగా 8 వార్డు స్వతంత్ర అ భ్యర్థి ఇర్ఫానారియాజ్‌ కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తూ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా లను ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. అనం తరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ప్ర భుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు యువకు లు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వివరిం చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్‌ పై గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు. యువకులు మీర్జారియాజ్‌, మోకిద్‌, హైమద్‌, షరీఫ్‌, గొల్లపల్లి కృష్ణ, అయూబ్‌ పార్టీలో చేరగా, కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు అరుణ, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీధర్‌, నరాల దేవరాజు, విన్సెంట్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రమేశ్‌బాబుకు కృతజ్ఞతలు

మేడిపల్లి: వేములవా డ సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబును మేడిపల్లి మండలం టీ ఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అంకం విజయసాగర్‌, జగి త్యాల  జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. నమ్మకంతో ప్రచార బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేములవాడ మున్సిపల్‌ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున ఇం టింటి ప్రచారం చేశారు. ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌లు వెంకటేశం, ఎంపీటీసీ రవీందర్‌రా వు, నాయకులు గంగాధర్‌, కిషన్‌, మల్లయ్య, రాజరెడ్డి, రవిగౌడ్‌, సత్తిరెడ్డి పాల్గొన్నారు.