ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Jan 17, 2020 , 01:21:50

ప్రచార హోరు..

ప్రచార హోరు..


వేములవాడ, నమస్తేతెలంగాణ: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటు అడిగే హక్కు తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్పష్టంచేశారు. గురువారం వేములవాడ పురపాలక సంఘంలో టీఆర్ కౌన్సిలర్ అభ్యర్థులు భారీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 24వ వార్డు కౌన్సిలర్ చీకోటి అనురాధ శ్రీనివాస్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ పట్టం కట్టారన్నారు. వేములవాడ నియోజకవర్గంలోనూ వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేశామన్నారు. పురపాలక సంఘంలోనూ వందలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. వేములవాడలో రహదారులు, మురుగు కాలువలు, సీసీ రహదారులు, వంతెన నిర్మాణాలు లాంటివి కూడా పూర్తవుతాయన్నారు.

నిరుపేదలకు కూడా రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణానికి ఇప్పటికే 42 కోట్ల నిధులు మంజూరు కాగా మొదటి విడుతలో 800 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి నిరుపేదలకు అందిస్తామన్నారు. గడిచిన ఎండాకాలంలోనూ ప్రతి ఇంటికీ భగీరథ నీరును అందించామని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని కొనియాడారు. జిల్లా మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో వచ్చే నాలుగేళ్లలో మరింత అభివృద్ధిని సాధించుకుందామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. రాష్ట్ర మార్క్ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీఆర్ ఓటువేసి మరోసారి అభివృద్ధిని చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు సముచితస్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇదామన్నారు.

ఇక 12వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి తీగల శైలజవెంకటేశ్వర్ మద్దతుగా రాష్ట్ర మార్క్ చైర్మన్ లోక బాపురెడ్డి, 11వ వార్డులో యాచమనేని శ్రీనివాసరావుకు మద్దతుగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాల కొండ అరుణలు ప్రచారం చేశారు. ఇక 16వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కొండ శ్రీలతకు మద్దతుగా రాష్ట్ర మున్నూరుకాపు పటేల్ సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, కనుకయ్యలు, 25వ వార్డులో అభ్యర్థి గుడూరి లక్ష్మీ,మధులు, 26వ వార్డులో అభ్యర్థి నామాల ఉమలక్ష్మీరాజంలు, 27వవార్డులో అభ్యర్థి గోలి మహేశ్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లోఎంపీపీలు బూర వజ్రమ్మ,  రేవతి,  జడ్పీటీసీలు మ్యాకల రవి, నాగం భూమయ్య, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, మాజీ మార్కెట్ కమిటి వైస్ వర్ధినేని నాగేశ్వర్ మండల పార్టీ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్, కల్లెడ శంకర్, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు మంతెన సంతోశ్, నాయకులు యాదగిరి ప్రసాద్ ఫీర్ మహమ్మద్, రేగులపాటి చరణ్ కట్కూరి శ్రీనివాస్, పైడ శ్రీనివాస్,  శ్రీరాముల కిష్టయ్య, సత్యనారాయణరెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
logo