మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 17, 2020 , 01:21:09

హోరెత్తిన ప్రచారం

హోరెత్తిన ప్రచారం


సిరిసిల్ల టౌన్:  సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గురువారం ప్రచారం హోరెత్తింది. టీఆర్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చేసిన చారిత్రక అభివృద్ధిని వివరిస్తూ టీఆర్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత ఐదేండ్లలో సిరిసిల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ పార్టీ అభ్యర్థులు తమ వా ర్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. పలు వార్డుల్లో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ శ్రే ణులు మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. 3వ వార్డులో జిందం కళ-చక్రపాణి దంపతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ పార్టీ శ్రేణులు, మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న వీరికి స్థానికులు ఘనస్వాగతం పలికారు.

అదేవిధంగా 16వ వార్డులో టీఆర్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జె తారకు మద్దతుగా సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాష్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. 39వ వార్డులో స్థానిక టీఆర్ అ భ్యర్థి ఆకుల కృష్ణ (చిన్న)కు మద్దతుగా నాయకు లు భారీ ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కృష్ణను ఆశీర్వదించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ కుం భాల మల్లారెడ్డి, నాయకులు పులి రమేశ్, నమిలికొండ నర్సయ్య పాల్గొన్నారు.

విలీన గ్రామాల్లో..

సిరిసిల్ల రూరల్: సిరిసిల్లలో విలీనమైన గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది.ఈ మేరకు ముష్టిపల్లిలో 10వవార్డు అభ్యర్థి దడిగెల శ్రావణ్ తన మద్దతుదారులు పార్టీ శ్రేణులకు ప్రచారం చేశారు. 1వ వార్డులో పోచవేణి సత్య-ఎల్లయ్యయాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. 9వ వార్డులో లింగంపెల్లి స త్యనారాయణ ప్రచారం నిర్వహించారు.11వవార్డులో ఒగ్గు ఉమ-రాజేశం,12 వార్డులో పా తూరి రాజిరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో టీఆర్ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అభ్యర్థులకు బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు.