శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jan 15, 2020 , 03:51:08

అభివృద్ధికి పట్టగట్టాలి

అభివృద్ధికి పట్టగట్టాలి


వేములవాడ, నమస్తేతెలంగాణ: అభివృద్ధి, నిజాయతీ పాలనకే వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టి గులాబీ జెండాను బల్దియాపై ఎగరవేద్దామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే 28మంది అభ్యర్థులకు బీ ఫామ్‌లను పట్టణంలోని సంగీత నిలయంలో మంగళవారం ఆయన అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. మార్పునకు ఇది మంచి సమయమని, ప్రజలు అభివృద్ధి, నిజాయితీ పాలనకు పట్టం కట్టాలని కోరారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో కలిసి చర్చించి నిస్వార్థంగా సేవ చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారని ఎంపిక చేశామని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వేములవాడ పట్టణంలో రూ.212కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయని, అందులో రూ.80కోట్లతో గుడిచెరువు సుందరీకరిస్తున్నామని,, రూ. 20కోట్లతో ప్రభుత్వ వైద్యశాలను ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని వివరించారు. సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు, తాగునీటి వసతి లాంటి ఎన్నో సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు.

25టీఎంసీల గోదావరి జలాలు తలాపున ఉన్నాయని, ఏళ్ల తరబడిగా ఉన్న నీటి కష్టాలు తొలగిపోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉండడమే కాకుండా, వేములవాడ పురపాలక సంఘంలో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీకి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణంలో ఇచ్చిన ఓటర్ల తీర్పే అందుకు నిదర్శనమని ఉదహరించారు. ఇతర పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అన్ని వార్డుల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించి పురపాలక సంఘంపై గులాబీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా మంత్రి, పురపాలక శాఖమ ంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాజన్న క్షేత్రం వేములవాడ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. భూ కబ్జాలు, అవినీతి పరిపాలనను తరిమికొట్టి అభివృద్ధికి భరోసా ఇవ్వాలని కోరారు.

18న మంత్రి కేటీఆర్‌ రోడ్డు షో

పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా 18వ తేదీ శనివారం రోజున వేములవాడలో భారీ రో డ్డుషోను నిర్వహించనున్నామని, కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారని వివరించారు. పట్టణంలోని అన్నివార్డుల నుంచి సుమా రు 10వేల మంది ప్రజలతో తిప్పాపూర్‌ నుంచి కోరుట్ల బస్టాండ్‌ వరకూ ర్యాలీ కొనసాగుతుందని, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని తెలిపా రు. రోడ్‌షోకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివ చ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. అనంత రం బీఫామ్‌లు తీసుకున్న అభ్యర్థులతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీ పీ బూర వజ్రమ్మ, పార్టీ పట్టణాధ్యక్షుడు పు ల్కం రాజు, సెస్‌ డైరెక్టర్లు రా మతీర్థపు రా జు, జడల శ్రీనివాస్‌, పొలాస నరేందర్‌, పీ చర భాస్కర్‌రావు, ప్రసాద్‌రావు, యేస తిరుపతి నాయకులు పాల్గొన్నారు.logo