ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jan 15, 2020 , 03:50:28

టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు


సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదనీ, పురపాలక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో సిరిసిల్ల మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని టెస్కా బ్‌ చైర్మన్‌, ఎన్నికల కమిటీ సభ్యుడు కొండూరి రవీందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులు చీటి నర్సింగారావు, గూడురి ప్రవీణ్‌, తోట ఆగయ్యతోపాటు నాయకులతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండూరి మాట్లాడుతూ, ప్రజల హృదయాల్లో టీఆర్‌ఎస్‌ స్థానం పదిలంగా ఉందనీ, ప్రజలంతా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కావడం సంతోషమన్నారు. ఈ వార్డు ల్లో నామినేషన్లను ఉపసంహరిచుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులకు పార్టీ తరపున, నాయకుల తరపున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశానుసారం నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి ప్రజల్లో పార్టీకి ఎదురులేకుండా ఉందన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మిగి లిన 35స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరా రు. సిరిసిల్లలో ప్రతిపక్షాలు పోటీకి చతికిల పడ్డాయన్నా రు. 25స్థానాల్లో బీజేపీ, 20స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేశారనీ, పూర్తి వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవాచేశారు. బంగారు తెలంగాణే లక్ష్యం గా సీఎం కేసీఆర్‌ ఐదేళ్లలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

 సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని దీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమన్నారు. ప్రజ లు టీఆర్‌ఎస్‌ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పేదలకు అండ గా ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. గత 50ఏళ్లలో జరుగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపించారన్నారు. సిరిసిల్ల ప్రజలంతా కేటీఆర్‌కు మద్దతు తెలపాలని కోరా రు. సమావేశంలో  టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి , మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ సామల పావని, నేత లు ధర్మేందర్‌, విద్యాసాగర్‌, ఎర్రవెల్లి చంద్రశేఖర్‌రావు, సెస్‌ డైరెక్టర్లు విజయరామారావు, కుంబాల మల్లారెడ్డి, పీఏసీసీ చైర్మన్‌ తన్నీరు బాపురావు, టీఆర్‌ఎస్‌ గంభీరావుపేట మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు హైమద్‌, కొమ్ము బాలయ్య, పడిగెల రాజు, శ్రీనివాసరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, గంద్యాడపు రాజు, అభిలాష్‌, దోసల రాజు, అన్వర్‌ పాల్గొన్నారు.logo