గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 15, 2020 , 03:47:09

వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం

వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం


వేములవాడ కల్చరల్‌: రాజన్న అనుబంధ దేవాలయమైన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో మంగళవారం సా యంత్రం గోదారంగ రంగనాథుల స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామివారి ఆలయ పూజారి నేరెళ్ల  పురుషోత్తమాచార్యులు, రాజన్న ఆలయ అర్చకులు, రుత్వికులు కల్యాణాన్ని ఘనం గా నిర్వహించారు. కాగా భక్తు లు పెద్ద ఎత్తున తరలివచ్చి పూ జల్లో పాల్గొన్నారు. తొలుత రాజన్న ఆలయ అర్చకులు కల్యాణవేదికపై ఒకవైపు రంగనాయకస్వామివారు, మరోవైపు గోదాదేవిని ఉత్సవమూర్తులపై ఉంచారు. అనంతరం కలశ ఆవాహన,  పుణ్యాహవచనం, అంకురారోపణ, హోమం, సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ, పూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వరగారి సురేశ్‌, గోపన్నగారి నాగన్న, గణేశ్‌, శివుడు, ప్రతాప శ్రీనివాస్‌, నేరెళ్ల సందీప్‌, ఆలయ పర్యవేక్షకులు హరిహరనాథ్‌, ముదుగంటి రవీందర్‌ రెడ్డి, గట్టు గౌతమ్‌, భక్తులు పాల్గొన్నారు.