శుక్రవారం 05 జూన్ 2020
Rajanna-siricilla - Jan 14, 2020 , 03:30:44

పల్స్‌పోలియోను విజయవంతం చేయాలి

పల్స్‌పోలియోను విజయవంతం చేయాలి


కలెక్టరేట్‌: ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే పల్స్‌పోలియోను అధికారులందరూ సమన్వయంతో చేపట్టాలని సూచించారు. జిల్లా లో 48,686 మంది చిన్నారులు ఉన్నారనీ, వీరందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత చిన్నారుల తల్లిదండ్రులు, వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, బస్టాండ్‌, బస్తీలు, ఇటుకబట్టీల ప్రాంతాల్లో పోలియో కేం ద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ వేయాలని ఆదేశించారు. పల్స్‌పోలియో ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందనీ, 20, 21తేదీల్లో ఇంటింటికీ చుక్కల మందు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. పట్టణాలలోని ముఖ్య కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో పోలియో చుక్కల శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 398పల్స్‌పోలియో బూత్‌ లు, 28ట్రాన్సిట్‌ టీమ్‌లు, 14మొబైల్‌ బూత్‌లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. చిన్నారులు వైకల్యం బారిన పడకుండా ఉండాలంటే పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో ఖిమ్యానాయక్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.సుమన్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

లింగ వివక్ష రూపుమాపాలి

జిల్లాలో లింగ వివక్షను రూపుమాపాలనీ, ఇందుకోసం గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధచట్టం అమలుపై జిల్లా స్థా యి సలహా కమిటీతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. గర్భస్థ శిశు ఆరోగ్య పరిశీలనకు అనుమతించిన పరీక్షలను పిండ లింగ నిర్ధారణకు దుర్వినియోగం చేయడంతో భ్రూణ హత్యలకు దారితీస్తుందన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.logo