శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 14, 2020 , 03:30:06

గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు పాటించాలి

గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు పాటించాలి


కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై సోమవారం ఆయన హైద రాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిరిసిల్ల నుంచి కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎన్ని కల నియమావళి ప్రకారం తెలుగు అక్షరమాల ప్రకారం బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలన్నారు. ప్రింటింగ్‌కు ముందు బ్యాలెట్‌ పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిం చాలని సూచించారు. పోలింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూ షన్‌ రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతు లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహణకు సం బంధించిన రిపోర్టులు ఆలస్యం లేకుండా సకాలం లో పంపాలని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ చేపట్టాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించిన ఉత్తమ అధికారులను గుర్తించి అవార్డులు ప్రదా నం చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలను చైతన్య వంతులను చేసి, ఓటింగ్‌ శాతం ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌సలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, ప్రవీణ్‌కుమార్‌, డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, పట్టణ సీఐలు తదితరులు పాల్గొన్నారు.