సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Jan 13, 2020 , 03:55:20

పుర పోరులో కారు జోరు

పుర పోరులో కారు జోరు
  • -జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రచారం షురూ
  • - ఇంటింటికీ వెళ్లి పలకరింపు.. ఓట్ల అభ్యర్థన
  • - ఫలితమిస్తున్న తారకమంత్రం
  • - గులాబీ గూటిలోకి వలసలు
  • - సిరిసిల్లలో 34వ వార్డుటీఆర్‌ఎస్‌ అభ్యర్థి దార్ల కీర్తన ఏకగ్రీవం
  • - మంథనిలో మున్సిపల్‌
  • - ఆయా పట్టణాల్లో జనంతో మమేకమవుతున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి/ సిరిసిల్ల నమస్తే తెలంగాణ/     సిరిసిల్ల టౌన్‌) : గులాబీ పార్టీ జోరుముందు మిగితా పార్టీలు చతికి  పడుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ తరపునే జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర పార్టీల తరపున అభ్యర్థులే కరువయ్యారు. సిరిసిల్ల మున్సిపాలిటిలో 39 వార్డుల్లో 236 మంది 419 నామినేషన్లు వేశారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది. టీఆర్‌ఎస్‌ తరపున 276 మంది నామినేషన్లు వే శారు. 39 వార్డుల్లో పార్టీ తరపున పోటీ చేసిన వారికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం బీ ఫాంలు అందించారు. టీఆర్‌ఎస్‌ తరపున ఒక్కో వార్డు లో ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఈ సారి నామినేషన్లు వేసేందుకు వెనుకడుగు వేశా రు. నామినేషన్‌ దాఖలులో బీజేపీ కన్నా వెనుకబడిన కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. 5, 6, 8, 10, 11, 17, 20, 22, 25, 29, 32, 34, 35, 39 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. 39 వార్డుల్లో కేవలం 25 వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేశా రు. మంత్రి, సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్‌ కార్మిక క్షేత్రంలో చేసిన అభివృద్ధి పనులు అడుగడుగునా దర్శన మిచ్చాయి. సం క్షేమ ఫలాలు ప్రజల్లోకి వేగంగా చొచ్చుకుపోయాయి. జాతీయపార్టీ అయిన బీజేపీ తరపున కూడా అన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. సిరిసిల్లలోని 5, 10, 13, 14, 18, 19, 22, 23, 24, 25, 36 వార్డుల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేయలేదు. బీజేపీ నుంచి 11 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. బీజేపీలోని రెండు వర్గాలతో ప్రజలకు ఆపార్టీపై విశ్వాసం లేకుండా పోయింది. సిరిసిల్ల పురపాలక ఎన్నికల్లో 39 వార్డుల్లో కేవలం 28 వార్డుల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేశారు.

తెలుగుదేశం తెరమరుగు..

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సిరిసిల్ల స్వరాష్ట్ర సాధన తర్వాత తెరమరుగయ్యింది. సిరిసిల్లలో ప్రజలు కారుకే మద్దతు ఇస్తున్నారు. 39 వార్డుల్లో టీడీపీ తరపున ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయ్యింది. వామ పక్షాలైన సీపీఐ, సీపీఎంలకు సిరిసిల్లలో పూర్వ వైభవం ల భించలేదు. సీపీఐ తరపున ఇద్దరు, సీపీఎం నుంచి ఐదుగురు, ఆల్‌ ఇండి యా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు. బీఎస్పీ నుంచి ఒ క్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ తర్వాత స్వతంత్య్ర అ భ్యర్థులు అధిక సంఖ్యలో 110 మంది నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ తరపున 236 మంది నామినేషన్లు వేయగా, 63 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు.

కేటీఆర్‌ అభివృద్దే అండగా..

మంత్రి కేటీఆర్‌ చేసిన అభివృద్ధి, సమస్యలపై తక్షణ స్పందన, నేత కార్మికుల కు బహుళ ఉపాధి పథకాలతో ఈ ప్రాం తంలో కారుకు స్పీడు పెరిగింది. టీఆర్‌ఎ స్‌తో  పోటీచేస్తే గెలుపు ఖాయమనే న మ్మకం అభ్యర్థుల్లో నాటుకుపోయింది. సీఎం కేసీఆర్‌ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించడం, బ్యాక్‌ వా టర్‌ సిరిసిల్లను తాకడం కూడా ఈ ప్రాంతంలో చరిత్ర సృష్టించింది. మెట్ట ప్రాంత మైన ఇక్కడ భూగర్భజలాలు సమృద్ది కేవ లం కేసీఆర్‌తోనే సాధ్యమయిందనే విశ్వాసం కూడా ఉంది.

ప్రచారం షురూ..

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ పురపాలక సం ఘంలో ఎన్నికల ప్రచార సందడి మొదలైంది. ఆదివారం సాయినగర్‌లో తీగల శైలజ-వెంకటేశ్వర్‌రావు కాలనీలో ర్యాలీగా వెళ్తూ ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. రాజీవ్‌నగర్‌లోని చెక్కపల్లి రహదారిలో పుల్కం శ్రీలక్ష్మీరాజు ప్రచారాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్‌గా తాము చేసిన సేవలను గుర్తించి మరోసారి అవకాశం ఇవ్వాలని వారు ఇంటింటా ప్రచారం చేశారు. శాస్త్రినగర్‌లో కొం డ కనుకయ్య గడపగడపకూ ప్రచారాన్ని చేపట్టారు.

శివాజీ యూత్‌ మద్దతు

వేములవాడ రూరల్‌ : వేములవాడ మున్సిపల్‌ పరిధి శాత్రా జుపల్లి గ్రామంలోని మొదటి, రెండో వార్డు సభ్యులకు అదే గ్రా మానికి చెందిన శివాజీ యూత్‌ పూర్తి మద్దతు పలికినట్లు టీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి తెలిపారు. టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధిక మోజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూత్‌ సభ్యులను అభినందించారు. కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గుడిసె పద్మ, జయసలీం, నాయ కులు గుడిసె సదానందంతో పాటు శివాజీ యూత్‌ సభ్యులు, త దితరులు పాల్గొన్నారు.