సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jan 13, 2020 , 03:51:32

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం భేష్‌

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం భేష్‌
  • - కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌
  • -తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలో పర్యటన
  • - క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

సిరిసిల్ల రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం బాగుందని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకుసాగడంతోనే విజయవంతంమైందని ఉద్ఘాటించారు. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మం డలం రామన్నపల్లెలో ఆదివారం పర్యటించారు.  కాలినడకన వాడల్లో కలియదిరిగారు. పల్లె ప్రగ తిలో చేపట్టిన పనులను క్షేత్ర స్థాయిలో  పరిశీలించారు.  పారిశుధ్య పనుల నిర్వహణ, రోడ్లు, ము రుగుకాలువలు,  ఇండ్ల పరిసరాలు, హరితహారం లో నాటిన మొక్కలను పరిశీలించారు.  నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంతీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడారు. రెండో విడత పల్లె ప్రగతి పనులపై సంతృప్తి  వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశు ధ్య పనులను నిరంతరం కొనసాగించాలన్నారు.   నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హె చ్చరించారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో హరిత గ్రామా లుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులు సైతం ఇదే తీరుగా ముం దుకెళ్లి సర్కారు సంకల్పాన్ని నెరవేర్చాలని కోరా రు. ఆయన వెంట  డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీవో రవీందర్‌, ఎంపీపీ పడిగెల మానస, ఎంపీడీవో చికోటి మదన్‌మోహన్‌, సర్పంచ్‌ ఆత్మకూరి రంగయ్య, ఎంపీటీసీ పుర్మాణి కనకలక్ష్మి, ఎంపీవో రాజు, ఈజీఎస్‌ ఏపీవో నాగరాజు, ఉపసర్పంచ్‌ దేవిరెడ్డి వార్డు సభ్యులు ఉన్నారు.


logo